నగరంలో డబుల్ బెడ్ రూము ఇండ్లకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి కెటిఆర్

 


నగరంలోని జియాగూడలో గోధెకి కబర్, కట్టెల మండిలో నిర్మాణాలు పూర్తి   అయిన డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లకు  సోమవారం ఐ.టి మున్సిపల్ శాఖ మంత్రి కె టి రామారావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్దిదారులకు డబుల్ బెడ్ రూము ఇండ్లు పంపిణి చేసారు. రూ.95.58 కోట్లతో   1,152 డబుల్ బెడ్ రూము ఇండ్లు నిర్మించారు. 

జియాగూడలో 840 ఇండ్లు, గోదెకి ఖబర్ లో 192, కట్టెల మండిలో 120 ఇండ్లు లబ్దిదారులకు పంపిణి చేసారు. ఈసందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఒక్కొక్క ఇంటిని రూ 9 లక్షల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రాము ఇండ్లు నగరంలో రూ 40 లక్షల విలువ చేస్తాయని అన్నారు. డబుల్ బెడ్ రూము కాలనీలలో అంగన్ వాడి కేంద్రం, బస్తి దవాఖాన, లైబ్రరి వంటి సదుపాయాలతో పాటు మోలిక సౌకర్యాలన్నిఏర్పాటు చేస్తామని చెప్పారు.

 రాష్ట్రంలో 18000 కోట్లతో 2.75  లక్షల ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలోకాంగ్రేస్ హయాంలో పేదల ఇండ్లపేరిట ఒక్కి ఇంటిని కూడ నిర్మించకుండా నిధులు కాజేసారని విమర్శించారు.ఒకసారితన పర్యటనలో పరకాల సమీపం లోని వరికోల్ గ్రామానికి వెళ్ళానని ఆ గ్రామంలో కాంగ్రేస్ ప్రభుత్వం  500 ఇండ్లు మంజూరు చేసిందని కాని ఒక్క ఇంటిని కూడ నిర్మించలేదన్నారు. ఇండ్లు నిర్మించకుండానే నాయకులు కాజేసారని అన్నారు. డబుల్ బెడ్ రూముల కోసం ఎవరూ మద్యవర్తులను ఆశ్రయించరాదని అన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులైన పేదలకు ఇండ్లు లభించేలా చుస్తామని మంత్రి పేర్కొన్నారు.మంత్రి సభలో మహిళల నినాదాలు

మంత్రి కెటిఆర్ పాల్గొన్న సభలో కొందరు మహళలు లేచి డబుల్ బెడ్ రూములు అలాట్ మెంట్లో అవకతవకలు జరిగాయని గొడవ చేసారు. అర్హులని కాదని టిఆర్ఎస్ పార్టీ వారికే ఇండ్లు ఇచ్చారని విమర్శించారు. 

కార్యక్రమంలో హొం మంత్రి మహమూద్ అలి, మంత్రి పశుసంవర్దక శాఖ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ జిహెచ్ ఎంసి మేయర్ దొంతు రాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు