పురాత స్కూల్ బిల్డింగ్ పడ గొట్టకుండా తరలించిన ఇంజనీర్లు

 

చైనా లో ఇంజనీరింగ్ అద్భుతం 


చైనాలో ఓ స్కూలు బిల్డింగ్ తరలించాల్సి రావడంతో దాన్ని పడగొట్టకుండా ఉన్నది ఉన్నట్లు 62 మీటర్ల వరకు జరిపి  ఇంజనీరింగ్ అద్భుతం ప్రదర్శించారు. షాంఘై నగరంలో 1935 సంవత్సరంలో ఐదంతస్తుల స్కూలు బిల్డింగ్ నిర్మించారు. 7600 టన్నుల ఈ పాఠశాల భవణం ఏం మాత్రం చెక్కు చెదరకుండా 18 రోజులు శ్రమించి పక్కకు షిఫ్ట్ చేసారు. ఇందు కోసం 198 రోబోటిక్ లెగ్స్ అమర్చారు. చారిత్రక కట్టడాలను కూల్చవద్దనే ఉద్దేశంతోనే ఇలా చేసారు. 85 సంవత్సరాల  చరిత్ర గల ఈ ప్రైమరి  పాఠశాలను 2018 లో మిడిల్ స్కూలుగా  మార్చారు.  

చైనాలో గతంలో అనేక భవణాలు వీల్స్ పై పక్కకు తరలించారు. 2017లో 135 ఏళ్ల పురాతన బౌద్ధ మందిర భవనాన్ని తరలించారు. 2 వేల టన్నుల బరువు గల ఈ భవణాన్ని 15 రోజుల సమయంలో 30 మీటర్ల దూరం వరకూ తరలించారు. 

చైనాలో నే కాకుండా గతంలోఅనేక దాశాలలో ఇట్లా భారి భవణాలను చెక్కు చెదరకుండా తరలించిన సందర్భాలు ఉనేకం ఉన్నాయి. కెనడాలో 2006 లో 40 గంటలు శ్రమించి చక్రాలపై తరలించారు. టెక్సాస్ లోని సాన్ ఆంటోనియో లో ఫేర్ మౌంట హేోటెల్ ను 1906 లో వాల్స్ పై తరలించారు. దీని బరువు 1600 టన్నులు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు