షేర్ చాట్ కోసం చివరికి బాలుడి ప్రాణం తీసాడు - శామీర్‌పేట లో దారుణం

ఫోన్ కాల్ ట్రేస్ చేసి హంతకున్నిప్టటుకున్న పోలీసులు
కిడ్నాప్ డ్రామా ఆడి 15 లక్షలు డిమాండ్ చేసిన హంతకుడు


షేర్ చాట్ క్రెడిట్ కోసం బీహార్ కు చెందిన ఓ యువకుడు అభం శుభం ఎరుగని  ఓ ఐదు సంవత్సరాల బాలున్ని అతి కిరాతకంగా హత్య చేశాడు.  బాలుడితో షేర్ చాట్ వీడియో లు తీస్తుండగా బాలుడికి తీవ్ర గాయం ఆయి రక్త స్రావం కావడంతో తల్లి దండ్రులకు తెలిస్తే గొడవ జరుగుతుందని భయపడి హత్య చేసినట్లు హంతకుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

శామీర్‌పేటకు చెందిన సయ్యద్ యూసఫ్ అనే ఆటో డ్రైవర్ కు ఒక కూతురు, ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు అధియాన్ ఈ నెల 12 వ తేది నుండి అదృష్యం అయ్యాడు. మూడు రోజుల పాటు కొడుకు కోసం వెదికినప్పటికి ఆచూకి లభించక పోవడంతో  ఈ నెల 15 వ తేదీన పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి వెదుకుతున్నామని చెప్పారు కాని ఏ క్లూను రాబట్ట లేక పోయారు. చివరికి 23 వ తేదీన ఆటో డ్రైవర్ కిరాయకు ఉంటున్న ఇంటి యజమానికి కిడ్నాపర్ పేరిట ఓ ఫోన్ కాల్ వచ్చింది. బాలుడు తనదగ్గరే ఉన్నాడని 15 లక్షలు ఇస్తే వదిలి పెడతానని కిడ్నాపర్ చెప్పాడు. దాంతో ఇంటి యజమాని ఈ విషయాన్ని బాలుడి తల్లి దండ్రులకు చెప్పగా వారు పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఫోన్ కాల్ ట్రేస్ చేసి దాని ఆధారంగా కిడ్నాపర్ ను బీహార్ కు చెందిన సుధాంశ్ అనే యువకుడుగా పోలీసులు గుర్తించారు. సుధాంశ్ ఆటో డ్రైవర్ ఇంటి పైనే ఓ గదిలో కిరాయికి ఉంటున్నాడు. సుదాంశ్ ను పోలీసులు తమ పద్దతిలో విచారించగా బాలున్నితానే హత్యచేసానని చెప్పాడు. షేర్ చాట్ వీడియో కోసం బాలున్ని తన గదికి తీసుకు వెళ్లి జంపింగ్ వీడియోలు తీసే వాడు. అట్లా రెండు వీడియోలు తీసాడు. మరో వీడియో తీసే క్రమంలో బాలుడు కింద పడి తీవ్రంగా గాయపడగా రక్త స్రావం కావడంతో బాలుడి తల్లిదండ్రులకు తెలిస్తే బాగా గొడవ జరుగుతుందని తనను కొడతారనే భయంతో  గుట్టు చప్పుడు కాకుండా బాలున్ని చంపేశాడు. బాలుడి శవాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి శామీర్ పేట లోని అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో పడేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. డబ్బుల కోసం  బాలున్ని కిడ్నాప్ చేసినట్లు బెదిరించాడు. ఒక వేల డబ్బులిస్తే ఆవి తీసుకుని బీహార్ కు పారిపోవచ్చని నిందితుడు ప్లాన్ వేసాడు. కానికథ అడ్డం తిరిగి పోలీసులకు దొరికి పోయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు