గర్భిణి కోసం స్పెషల్ మెట్రో ట్రైన్ నడిపించి గమ్యం చేర్చారు

 


హైదరాబాద్ నగర మంతా  కుంభ వృష్టితో జలమయమైన రాత్రి మెట్రో రైల్ సర్వీసెస్ అథారిటివారు ఓ గర్భిణి కోసం ప్రత్యేతకంగా మెట్రో నడిపించి సహాయపడ్డారు.  నగరాన్ని వరదలు ముంచెత్తిన బుధవారం రోజు(అక్టోబర్ 14 ) రాత్రి రవాణా సౌకర్యాలు లేక పోవడంతో నిస్సహాయతలో మెట్రో రైల్ సహాయం కోరింది. నగరంలో ఆటోలు,ఆర్టీసి బస్సులు అప్పటికే బంద్ అయ్యాయి.   ఓ గర్భిణి రాత్రి 9.30 గంటలు కావస్తుండగా  మరో పక్క హోరున వాన కురుస్తుండగా  హైదరాబాదులోని వీఆర్ కొత్తపేటలోని మెట్రో స్టేషన్. కు వచ్చింది.  తాను మియాపూర్ వెళ్లాలని, కానీ తను వెళ్లడానికి బస్సులు, ఆటోలు అందుబాటులో లేవని తనను ఎట్లాగైనా మియాపూరు చేర్చాలని వేడుకుంది.

కోవిడ్ నిబంధనల కారణంగా నగరంలో  మెట్రో రైళ్లు ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమేనడిపుస్తున్నారు. ఆమె ఆ రాత్రి  అక్కడికి చేరుకునే లోపే చివరి ట్రైన్ కూడ అప్పటికే వెళ్ళి పోయింది. ఏ ట్రైనూ లేదని   అక్కడి సిబ్బంది కూడా అదే విషయాన్ని ఆమెకు తెలిపారు.  కాని ఆ మహిళ తనకు ఎట్లాగైనా సహాయం చేయాలని ఇంత భారి వర్షంలో తనకు మెట్రో తప్ప ఇంటికి వెళ్ళేందుకు వేరే మార్గం లేదని బ్రతిమిలాడింది.

దాంతో మెట్రో సిబ్బంది ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపారు. ఆ మహిళ పరిస్థితి అర్దం చేసుకున్న అధికారులు ఆమె కోసం ప్రత్యేకంగా మెట్రో రైల్ అప్పటి కప్పుడు సిద్దం చేసి ఆమెను 40 నిమిషాల్లో మియాపూరు చెర్పారు.  రాత్రి 10 గంటలకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి బయలు దేరిన స్పెషల్ మెట్రో ట్రైన్ 10.40 గంటలకు మియాపూర్ కు చేరింది. 

గర్భిణి మహిల కోసం అత్యవసరంగా మెట్రో నడపాల్సి వచ్చిందని మెట్రో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎమ్‌డీ ఎన్వీఎస్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 

రాత్రి 9 గంటలకే మెట్రో సర్వీసులు బంద్ ఇయినా అత్యవసర పరిస్థితులలో పరిస్థితిని బట్టి మెట్రో సేవలు అందించాలని మార్గదర్శకాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఏ మైనా ఓ గర్భిణి మహిళ వేదనను అర్దం చేసుకుని ప్రత్యేక మెట్రో ట్రైన్  నడిపి సాయపడ్డందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అథారిటీ ని అభినందిచక తప్పదు.

కరోనా లాక్ డౌన్ కారణంగా మెట్రో రైల్ సర్వీసులు నాలుగు నెలలుగా నిలిపి వేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 7 నుండి మెట్రో  సర్వీసులు నడుస్తున్నాయి. అయితే కోవిడ్ నిభందనల మేరకు 60 శాతం ఆక్యుపెన్సి కెపాసిటీతో మెట్రోలు నడిపిస్తున్నారు. నిత్యం లక్ష మందిని గమ్యానికి చేరుస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎమ్‌డీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు వివరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు