సలాం ప్రతిమ ... జర్నలిజం పేరిట అరిచే స్వాములు కాదు....నిలదీసే ప్రతిమ మిశ్ర లు అవసరం

 జర్నలిజం పేరిట అరిచే స్వాములు కాదు....నిలదీసే ప్రతిమ మిశ్ర లు అవసరం 
హత్రాస్ ఘటన అనంతరం కవరేజి కోసం వెళ్లిన ప్రతిమ తన వృత్తి ధర్మం నెర వేర్చేందుకు పడిన తపనతో  దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుందిఉత్తర ప్రదేశ్   హత్రాస్ ఘటన ఆ తదనంతర పరిణామాలు ఈ దేశంలో ప్రస్తుతం  నెల కొన్న  వాస్తవ పరిస్థితులను నిలువుటద్దంలో చూపాయి. 

ఓ 20 ఏళ్ల యువతిని ఘోరంగా హింసించి అత్యాచారం చేసి అనవాళ్లు కూడ లేకుండా చెరిపి వేసే యత్నంలో మృత దేహాన్ని కూడ కుటుంబ సబ్యులకు అప్పగించకుండా తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసులే దహనం చేసిన ఘటన ఇంకా ఘోరాతి  ఘోరమైన దుర్షటన. 

ఇలాంటి ఘటన  సర్వసత్తాక ప్రజాస్వామ్య  గణ తంత్ర దేశంలో మొదటి దైతే కాదు.  హత్రాస్ ఘటన ఆఖరిది కావాలని ఆశిద్దాం. ఈ ఘోరాలు సాక్షాలను దహించి న్యాయాన్ని కప్పి పుచ్చేందుకు రాజ్య వ్యవస్థలే నేర వ్యవస్థలుగా మారడం దేశంలో ప్రజలు  చూడ లేక పోతున్నారు. ఏది నమ్మాలో ఏది నిజమో అబద్దమేదో తెలియని గందరగోళ పరిస్థితిలో  జనం మీడియా చెప్పే వాస్తవాల కోసం ఎదురు చూస్తారు.  

వ్యవస్థలను నిర్వీర్యం చేసి పరిహసిస్తున్న  పాలకుల దమన నీతికి ఇలాంటి సంఘటనలు మచ్చుతునకలు. మానవత్వపు విలువలు అడుగంటి పోయి రాజ్య వ్యవస్థలో ప్రతిమ మిశ్రా వంటి జర్నలిస్టులు అవసరం. మీడియా హవుజుల్లో  కూర్చుని అరుపులు కేకలు పెడ బొబ్బలు పెడుతూ సత్యాన్ని సమాధి చేసే స్వాముల కన్నా భాదితుల పక్షాన నిలిచి వారి దుఖాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించేందుకు ఓ మహిళా జర్నలిస్టు అయిన ప్రతిమ మిశ్రా పడిన తపన దేశ ప్రజలంతా చూసి జర్నలిజానికి సాల్యూట్ అన్నారు.

తనను అడ్డగించకుండా గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించాలంటూ పోలీసులతో ప్రధేయ పడింది. గొడవపడింది. అరిచి గీ పెట్టింది. ఏ అధికారంతో తనను తనతో పాటు ఉన్న వీడియో జర్నలిస్ట్ మనోజ్ ను అడ్డుకుంటారని నిలదీసింది. మీడియాను అడ్డుకునేందుకు పై అధికారుల నుండి జారి అయిన పత్రం ఏదో చూపమని పట్టు బట్టింది. ప్రతిమ మిశ్రా అడిగిన ప్రశ్నలకు పోలీసుల వద్ద సహేతుక జవాబులు లేవు. ప్రతిమ ప్రశ్నలకు తట్టుకోలేక పోలీసులు చివరికి  బలవంతంగా ఆమెను  ఆమె వెంట ఉన్న వీడియో జర్నలిస్టు ను జీబులోకి ఎక్కించి గ్రామం బయటకు తీసుకు వెళ్లి వదిలి పెట్టారు. ఓ యోగి పాలిస్తున్న  రాష్ర్టంలో పోలీసుల యూనిఫాం  గూండాగిరి దేశ వ్యాప్తంగా లైవ్ లో చూశారు. ప్రతిమ మిశ్రా హత్రాస్ లోనే ఉండి బాధితుల బాదనంతా దేశానికి చూపించింది. బాదితులకు న్యాయం జరిగే వరకు మీ వెంటే ఉంటానంటూ భరోసా ఇచ్చింది.

ఇలాంటి జర్నలిస్టులే ఇప్పుడీ దేశానికి అవసరం. శభాశ్ ప్రతిమ భేటి అంటూ దేశ వాసులు ఆమెను మెచ్చుకున్నారు. 

ప్రతిమ మిశ్రా గతంలో దిశ సంఘటన జరిగినపుడు కూడ జర్నలిస్టుగా భాదితుల కథనాలు ప్రపంచానికి చూపింది.  ఎబిపి హిందీ ఛానెల్ లో 2012 నుండి యాంకర్ గా జర్నలిస్టుగా పనిచేస్తోంది.  ఢిల్లి గాంగ్ రేప్ ప్రతిమ మిశ్రా మొదటి గ్రౌండ్ రిపోర్టింగ్ చేసింది. మానవీయ కోణంలో భాదితుల కథనాలు  ప్రసారం చేసింది.ప్రతిమ మిశ్రా తన వృత్తిలో ప్రతిభను చాటుకుని 1917 లో  అత్యంత ప్రతిష్టాత్మక మైన అవార్డు  అయిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు  రామ్ నాధ్ గోయేంకా పేరిట ఇచ్చే  అవార్డు నందుకుంది. కేంద్ర మంత్రి రాజా నాధ్ సింగ్ చేతుల మీదిగా ఆమె ఈ అవార్డును స్వీకరించింది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్వ రాష్ర్టం అయిన గుజరాత్ లో మెహాసనా జిల్లాలో ఓ  గ్రామంలో అగ్ర వర్ణాల వారు దళితులను మంచి నీటి బావి నుండి నీళ్ళు తోడుకో నీయడం లేదనే వార్త కథనాన్ని  ఇచ్చి గ్రామంలో కొన సాగుతున్న సామాజిక వివక్షత ను ఎత్తి చూపింది.  ఈ వార్తకు గాను  ఆమెకు రామ్ నాధ్ గోయెంకా ఎక్స లెన్సి  అవార్డు ప్రదానం చేసారు.  వార్తల విషయంలో  ప్రతిమకు మంచి పేరుంది. నిష్పక్ష పాతంగా నిజాలను వెలికి  దీసి వృత్తి  విలువలను కాపాడుతుందనే పేరు తెచ్చుకుంది. హత్రాస్ లో అందుకే ఆమె పట్టు విడవకుండా తన వృత్తి ధర్మాన్ని నెర వేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.

ఎబిపి టివిలో ప్రతి రోజు ఉదయం  ప్రసారం అయ్యే నమస్తే భారత్ ప్రోగ్రాంలో నాలుగు గంటల పాటు ఏక బిగిన  యాంకరింగ్ చేస్తుంది. ఈ కార్యక్రమం ఎబిపిలో బాగా పాపులర్ అయింది. 

ఒక సబ్జక్టని ఏమిటి పాలిటిక్సి, క్రైం, ఎన్నికలు, ఘర్షణలు, స్పోర్ట్స్ వంటి పలు అంశాలపై ప్రతిమ మిశ్రా న్యూస్ పాపుల్ అయ్యాయి. 

డిల్లీ యూనివర్శి కాలేజి ఆఫ్ మహారాజా అగ్ర సేన్ నుండి జర్నలిజంలో పట్టా పుచ్చుకున్న ప్రతిమ ట్రాన్స్ జెండర్స్ జీవితాలకు సంభందించి  "Who Am I" పేరిట పరిశోధనాత్మక పుస్తకం వెలువరించింది.

ప్రతిమ మిశ్రా హత్రాస్ ఘటనలో  మహిళా జర్నలిస్టు  అయి ఉండి భాదితుల గొంతుక వినిపించేందు కోసం చేసిన ప్రయత్నాలతో దేశ ప్రజల ప్రశంసలు అందుకుంది. ప్రతిమ చూపిన చొరవ చేసిన సాహసం చూసి అసలు జర్నలిస్టులంటే ఇట్లా ఉండాలంటూ జర్నలిస్టులకు  ఆదర్శ ప్రాయురాలంటూ కోట్లాది మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కొనియాడారు. 
Graduated in Journalism from University of Delhi's Maharaja Agrasen College. In her final year of college she has also written a well researched dissertation on the lives of transgenders in India, titled "Who Am I" And Where Do I Stand? Voicing the unheard third sex in India.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు