ప్రకాశ్ రాజ్ పెద్ద మనసు - యుకె లో చదువు కునేందుకు ఓ విద్యార్థిణికి సహాయం

            వైవిద్య  భరితమైన నటనతో మెప్పించే ఆక్టర్ ప్రకాశ్ రాజ్ సామాజిక సేవా కార్యక్రమాలలో కూడ తన వంతు భాద్యత తీసుకుంటూ చురుగ్గా ఉంటారు. తెలంగాణ రాష్ట్రం లో ఓ గ్రామాన్ని తీసుకుని అభివృద్ది చేసిన ప్రకాశ్ రాజ్ ఆంధ్రలో ఓ నిరుపేద విద్యార్థిణి ని విదేశాలలో ఉన్నత చదువులు చదివించేందుకు ముందుకు వచ్చారు.


                             

మాంచెస్టర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌ -యుకె లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు సీటు వచ్చిన ఓ నిరుపేద విద్యార్థిణికి సహాయం చేసేందుకు సినిమా ఆక్టర్ ప్రకాశ్ రాజ్ ముందుకు వచ్చాడు. 

తిగిరిప‌ల్లి సిరిచంద‌న‌ది  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పెద్దేవం గ్రామం. కష్ట పడి బిటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేసింది. చిన్నతనంలో తండ్రి చనిపోగా ఏ ఆస్తి పాస్తులు లేని తల్లి ఆ పని ఈ పని చేసి ఇద్దరు కూతుర్లను  చదివించింది. పెద్ద కూతురు సిరి చందన బిటెక్  లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమెకు మాంచెస్టర్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సాల్‌ఫోర్డ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు సీటు రాగా తనకా అవకాశం దొరికే ఛాన్స్ లేదని ఆశలు వదులుకుంది. అయితే తెల్సిన ఓ వ్యక్తి  సిరిచందన పరిస్థితి వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశాడు. 

అది చూసిన ఆక్టర్ ప్రకాశ్ రాజ్ సిరిచందన పై చదువులకు టూషన్ ఫీజులతో సహా ప్రయాణ ఖర్చులు  ఇతర అన్ని ఖర్చులు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. తనకు ఓ కూతురు ఉందని సిరిచందన రెండో కూతురని ఆమె చదువు పూర్తి అయ్యే వరకు సహాయం చేస్తానని ప్రకాశ్ రాజ్ హామి ఇచ్చారు.

ప్రకాశ్ రాజ్ చేసిన సహాయానికి సిరిచందన కృతజ్ఞతలు తెలియ చేసింది. ప్రకాశ్ రాజ్ తన తండ్రి బాద్యత తీసుకుని సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడని ఆయన కెంతో రుణ పడి ఉన్నానని అన్నారు. ఆయన చేసిన సహాయాన్ని స్పూర్తిగా తీసుకుని తానుకూడ ఉద్యోగంలో స్థిర పడిన అనంతరం ఇతరులకు సహాయం చేస్తానని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు