ఖమ్మం లో దారుణం - అత్యాచార యత్నం ఫలించక పోవడంతో మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

10 రోజుల క్రితం జరిగిన ఘటన
ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో  పోలీసుల విచారణ
70 శాతం కాలిన గాయాలతో చావుబతుకుల మద్య చికిత్స పొందుతున్న బాలిక

 


ఖమ్మం జిల్లా కేంద్రంలో  అత్యాచారయత్నాన్ని  ప్రతిఘటించిన ఓ మైనర్ బాలికపై ఓ సంపన్న ఇంటి యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ సంఘటన జరిగింది. పట్టణంలో 10 రోజుల క్రితం జరిగిన ఈ సంమటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం చావు బతుకుల మద్య ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

పల్లెగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక ముస్తాఫా‌ నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో పని మనిషిగా పనిచేస్తున్నది. ఆ ఇంటి యజమాని కుమారుడు పలు మార్లు ఆ అమ్మాయిపై అత్యాచార యత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. 10 రోజుల క్రితం ఆ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచార యత్నం చేసాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడ మే కాక తల్లి దండ్రులకు చెబుతానని చెప్పడంతో యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతూ అరుస్తూ ఇంటి బయటికి  పరుగెత్తుకొచ్చిన బాలిక ఒంటిపై  చుట్టు పక్కల ఇండ్ల వారు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న  బాలిక పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ విషయం బయటికి చెబితే తల్లి దండ్రులను కూడ చంపేస్తానంటూ ఆ యువకుడు బెదిరించడంతో  బాలిక భయపడి పోవడంతో విషయం  ఆలస్యంగా బయట పడింది. సోమవారం ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు విచారణ చేపట్టారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు