నాయినిని పరామర్శించిన కెసిఆర్ - భావోద్వేగంతో కంట తడి

 


అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  రాష్ర్ట మాజి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం పరామర్శించారు. నరసింహారెడ్డి జూబ్లి హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన అరోగ్యం బాగా కీణించడంతో వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నారు.  ఆసుపత్రిలో నరసింహారెడ్డిని చూసి కెసిఆర్ భావోద్వేగానికి గురయ్యాడు. కంటనీరు పెట్టుకున్నారు. నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెల్సుకున్నారు. నరసింహారెడ్డి కుటుంబ సబ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయనకు వైద్య చికిత్సలో ఏలోటూ రానీయకుండా చూడాలని సిఎం అదేశించారు. నరసింహారెడ్డి కి కరోనా సోకి అనారోగ్యం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం స్వస్థత చేకూరినా ఆ తర్వాత తిరిగి అనారోగ్యం పాలయ్యారు. ఆక్సిజన్ లెవల్స్ బాగ తగ్గి పోవడంతో పాటు న్యూమోనియా సోకిందని వైద్యులు తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు