ఏనుగుల మృతికి కారణం అయిన ట్రైన్ ఇంజన్ సీజ్ - 12 కోట్ల పరిహారం వసూలు చేసిన పారెస్ట్ శాఖ

 

అస్సాంలో ఘటన -  రిజర్వు ఫారెస్ట్ లోని ఎలిఫెంట్ కారడార్ లో నిభందనలు ఉల్లింఘించిన రైల్వే శాఖ


ఇండియన్ రైల్వేల చరిత్రలో మొదటిసారిగా ఓ రైల్ ఇంజన్ ను పారెస్టు అధికారులు సీజ్ చేసారు. సెప్టెంబర్ 27 వ తేదీన గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టడంతో ఓతల్లి ఏనుగుతో పాటు పిల్ల ఏనుగు  చనిపోయాయి. ఆక్సిడెంట్ ఫలితంగా రైల్వే శాఖ పరిహారం రూపంలో భారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.హోజాయ్ జిల్లాలో పఠార్ఖోలా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఆక్సి డెంట్ చోటు చేసుకుంది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఫారెస్ట్ అధికారులు చట్ట ప్రకారం ఏనుగుల చావుకు కారణమైన గూడ్స్  ట్రైన్ ను  సీజ్ చేయాల్సి రావడంతో మొత్తం ట్రైన్ ను సీజ్ చేయడం సాధ్యం కాక పోవడంతో చివరికి ట్రైన్ ఇంజన్ ను సీజ్ చేసారు. అంతే కాదు ఈ కేసులో గువహటి లోని రైల్వే  డివిజన్ కార్యాలయంపై పారెస్టు అధికారులు ఆకస్మిక దాడి చేసి సీనియర్ డిఎంఇ  చంద్ర మోహన్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. ట్రైన్ ఇంజన్ కింద పడి ఏనుగులు మృతి చెందినందుకు నష్ట పరిహారంగా 12 కోట్లను చెల్లించేందుకు రైల్వే శాఖ సిద్దపడడంతో జామీనుపై అతన్ని వదిలిపెట్టారు. రిజర్వు ఫారెస్టు పరిధిలో ఎలిఫంట్ కారిడార్ లో ట్రైన్ గంటకు 30 కి.మీ వేగం మించ రాదు. కాని ఆక్సి డెంట్ జరిగినరోజు ట్రైన్ 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని డివిజనల్ పారెస్ట్ అధికారి రజిబ్ దాస్ మీడియాకు తెలిపారు. రైల్వే శాఖ విచారణ అనంతరం ప్రమాదానికి కారణ మైన ట్రైన్ డ్రైవర్ ను అసిస్టెంట్ డ్రైవర్ ను సస్పెండ్ చేసింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు