బాలుడి కిడ్నాప్ పై కొనసాగుతున్న ఉత్కంఠ- మానుకోటలో కిడ్నాపింగ్ అలజడి

 ఇంటర్నెట్ ద్వాార పోన్ కాల్స్ చేసిన కిడ్నాపర్లు
బాలుడికి జ్వరం వస్తే టాబ్లెట్లు వేసామని చెప్పిన కిడ్నాపర్లు
పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సి పోయిందన్న కిడ్నాపర్లు
తల్లి దండ్రుల్లో ఆందోళన


మానుకోట జిల్లా కేంద్రంలో బాలుడి కిడ్నాప్ ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన టిన్యూస్ ఛానెల్  రిపోర్టర్ గా పనిచేస్తున్న రంజిత్ రెడ్డి కుమారుడు  దీక్షిత్‌ (9) ను కిడ్నాపర్లు ఆదివారం కిడ్నాప్ చేసారు. దీక్షిత్ తల్లికి సోమవారం ఉదయం మద్యాహ్నం నాలుగు సార్లు ఫోన్లు చేసారు. రూ 45 లక్షలు అస్తేనే బాలున్ని వదిలి వేస్తామని బెదిరించారు. బాలుడి కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు పిర్యాదు చేస్తే బాలున్ని చంపేస్తామని బెదిరించారు. బాలుడికి జ్వరం వచ్చిందని టాబ్లెట్లువేశామని  కూడ కిడ్నాపర్లు బాలిడి తల్లికి చెప్పారు. అయితే  బాలుడి తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 100 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు కిడ్పాపర్ల ఆచూకి కోసం వేట ప్రారంభించారు.  పోలీసులు వెదుకుతున్న విషయం కిడ్నాపర్లకు కూడ తెల్సి పోయింది. ఆ విషయం బాలుడి తల్లితో పోన్ లో మాట్లాడిన సందర్బంగా కిడ్నాపర్లు చెప్పారు. మీరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మాకు తెల్సు..అడిగిన డబ్బులు ఇస్తే బాలున్ని క్షేమంగా వదిలి వేస్తాం లేదంటే చంపేస్తామని బెదిరించడంతో తల్లి దండ్రులు  ఆందోళన వ్యక్తం చేశారు. 

పోలీసులు బాలుడి కిడ్నాప్ వ్యవహారాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాలుడి కిడ్నాప్ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

 ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. కిడ్నాపర్లు  ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేస్తుండడంతో వార లొకేషన్లు గుర్తించడం సాధ్యం కాలేదు. బాలున్ని కిడ్నాపర్లు బైక్ పై తీసుకు వెళుతున్న దృష్యాలు పట్టణంలో సిసికెమెరాల ద్వారా రికార్డు అయ్యాయి.  బాలుడి కిడ్నాప్ వ్యవహారంపై పట్టణ వాసుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. జర్నలిస్టులు కూడ బాలుడి కిడ్నాప్ పై స్పందించారు. వెంటనే బాలునికి ఏ హాని తలపెట్టకుండా విచిడి పెట్టాలని జర్నలిస్టు సంఘాల నేతలు కోరారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు