ఎపిలో ఇసుక దందా ఇక సాగదు- పూర్తిగా పారదర్శకం - మాఫియాలకు తావు లేని సులభ రీతి

 


ఎపిలో ఇసుక మాఫియాలకు తావులేకుండా పూర్తిగా పారదర్శక విధానాలు రూపొందిస్తున్నారు. కామన్ మాన్ ను దృష్టిలో పెట్టుకుని సులభ రీతిలో ఇసుక లబించే విదంగా అందరికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి అందరికి ఆమోద యోగ్యమైన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు. కొత్త నిర్ణయాలు అమలు జరిగితే ఇక ఎపిలో ఇసుక దందా చేసే మాఫియాల ముఠాలకు అడ్డకట్టలు పడతాయి. ప్రాంతాలను బట్టి ఇసుక ధరలు నిర్ణయించనున్నారు. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది. చలాన కట్టి ఎవరైనా ఇసుక తీసుకుపోయేలా ఏర్పాట్లు చేయాలని సిఎం జగన్ సూచించారు. అట్లాగే సామాన్యులు ముఖ్యంగా పేదల ఇండ్ల నిర్మాణాలకు సబ్సిడీపై ఇసుక విక్రయిస్తారు. ఇందు కోసం కూపన్ల పద్దతి అమలు చేయనున్నారు.  అట్లాగే ప్రభుత్వ నిర్మాణాలకు సైతం ఇసుక సబ్సిడి ధరపై ఇస్తారు. ఇసుకకు కొదువ లేకుండా అవసరాల మేరకు వాడుకునేందుకు కొత్త రీచులు గుర్ితంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు