చంచల్‌గూడ జైళులో ఉరేసుకుని చని పోయిన తహశీల్ దార్ నాగరాజు

 కోటి 10 లక్షల లంచం తీసుకుంటు పట్టుబడిన నాగరాజు

మానసిక కృంగు బాటుతో ఆత్మహత్య 


కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడిన తహశీల్ దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

దీంతో మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ అప్పటి కీసర తహశీల్దార్‌గా ఉన్న నాగరాజు పట్టుబడ్డారు. ఆయనతో పాటు వీఆర్ఏ సాయి రాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల దాడుల్లో 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి దానికి సంబంధించిన రూ. కోటీ పది లక్షల డబ్బును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉప్పల్‌లోని శ్రీ చౌలా శ్రీనాథ్ యాదవ్, శ్రీ సత్య డెవలపర్ల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు సైతం ఏసీబీ విచారణలో స్పష్టమైంది.

నాగరాజు వద్ద భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు కారులో రూ. 8 లక్షలు, అతని ఇంట్లో రూ.28 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే 500 గ్రాముల బంగారు ఆభరణాలు, లాకర్ కీ ఏసీబీ అధికారులకు దొరికాయి. అనేక స్థిరాస్తులు సోదాల్లో బయటపడ్డాయి. లంచం తీసుకున్న నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, లంచం ఇచ్చినందుకు చౌలా శ్రీనాథ్ యాదవ్‌తో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అధికారులు నాగరాజును చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మొదటి కేసులో శ్రీనాథ్, అంజిరెడ్డి, సాయిరాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్, రెండో కేసులో కూడా ప్రధాన నిందితుడు గా ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజు కు బెయిల్ నిరాకరించింది. దాంతో తీవ్రమైన మనోవేదనకు గురైన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు