ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు

ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు


కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె.. చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు. కూచిపూడి నాట్య కళాకారిణిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభానయుడు.

పద్మావతి పాత్రల్లో రాణించారు. హైదరాబాద్‌ కూచిపూడి ఆర్ట్‌ అకాడమీకి ఆమె ప్రిన్సి‌పాల్‌‌గా పనిచేశారు. కూచిపూడి నృత్యంలో వందల మందికి శిక్షణనిచ్చారు. శోభానాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్‌, 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్‌, మెక్సికో, వెనిజులా, క్యూబా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

 ఆమె మృతి వార్త విని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.
ఎపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజి సిఎం చంద్ర బాబు నాయుడు తో పాటు సినిమా నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు