వై.ఎస్. జగన్ ను సిఎం పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో రిట్

 



వై.ఎస్. జగన్‌ మోహన్ రెడ్డిని  సీఎం పదవి నుంచి తప్పించాలంటూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

ఇందులో సీఎం జగన్‌పై న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను శంకిస్తూ ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు రాసిన  రాసిన లేఖపై న్యాయ వాదులు మండి పడుతున్నారు. వై.ఎస్ జగన్ లేఖను ఖండిస్తూ డిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మాణం చేయగా ఇద్దరు న్యాయ వాదులు ఇప్పుడు సుప్రీంలో రిట్ పిటీషన్ దాఖలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. సర్వ స్వతంత్ర న్యాయ వ్యవస్థపై ఓ రాష్ర్ట ముఖ్యమంత్రి లేఖ రాయడం పట్ల ్నేక ధర్మ సందేహాలువ్యక్తం అవుతున్నాయి.

రెండు శాఖల మధ్య నెల కొన్న వివాదం ఎక్కడికి దారితీస్తుందో నని న్యాయ నిపుణులు తర్జన భర్జన పడుతున్నారు.

సీఎం జగన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేయడంతో చర్చ తారా స్థాయికి చేరింది.  సోషల్ మీడియాలోను  టివీలు పత్రికలలో డిబేట్ల మీద డిబేట్లు జరుగుతున్నాయి.  పటీషన్ లో సిఎం జగన్ పై న్యాయ వాదులు తీవ్ర ఆరోపణలు కూడ చేసారు. జగన్ పై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని  ప్రస్తుత సుప్రీం కోర్టు జడ్జి ఎన్వి రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి కాబోయే వ్యక్తని అాలంటి వ్యక్తిపై వై.ఎస్ జగన్ ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తమ రిట్ పిటిషన్ లో  కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

అంతే కాకుండా న్యాయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు జగన్ కుట్ర చేసారని న్యాయ వాదులు ఆరోపించారు. జగన్ చేసిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించాలని సిఎం పదవిలో ఉంటూ  తన కార్యాలయాన్ని న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బ తీసేందుకు దుర్వినియోగం చేశాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయాడని వెంటనే పదవి నుండి తొలగించాలని కోరారు. న్యాయవాదుల రిట్ పిటిషన్ ఎప్పడు విచారణకు వస్తుందో ఇంకా స్పష్టత లేదు.  దసరాసెలవుల అనంతరమే ఈ రిట్ పిటీషన్ పై విచారణ జరగవచ్చని బావిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు