గాయం లేదు గీయం లేదు నేను బాగానే ఉన్నా..... ముఖ్యమంత్రి కుమారుడు హిమాన్శు

 


హిమాన్శు ఈ పేరు తెలంగాణ లో ప్రస్తుతం పాపులర్... గూగుల్ లో వెదికినా ఫోటోలతో సహా వివరాలు వస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారాబాల మనవడు. గురువారం ఆయన కొన్నిమీడియా హౌవుజ్ లకు వార్త అయ్యాడు. ప్రముఖ మీడియా హౌజ్  ఈనాడు సహా మరి కొన్ని వెబ్ సైట్లలో హిమాన్శు కాలికి గాయమైందని  నడవ లేని స్థితిలో ఉన్నాడని యశోధా అసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. కాలిమోకాలికి గాయం తగిలిందని గుర్రం స్వారి చేస్తుంటే కింద పడిపోయాడని కూడ వార్తలు వచ్చాయి. అయితే సాయంత్రాని కల్లా హిమాంశు పేరిట మీడియా సంస్థలకు వివరణలు అందాయి. తనకు ఎలాంటి ఫ్యాక్చర్‌ కాలేదన్నాడు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నాడు..ప్రస్తుతం తాను బాగానే నడుస్తున్నానని రేపటి నుంచి ఎప్పటి లాగే...మార్నింగ్‌ రన్నింగ్‌కు కూడా వెళతానని హిమాన్షు తెలిపాడు. కొన్ని వార్త పత్రికలు తనపై అనవసర వార్తలు రాస్తున్నాయని...అలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని అన్నారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాయడానికి ధైర్యం చేయవద్దని హిమాన్షు  మీడియా సంస్థలకు హితవుపలికాడు. పాపం హిమాన్శుకు తెలియదేమో ముఖ్యమంత్రి ఇంట్లో కుక్క వార్త అయినప్పుడు మనిషి కాకుండా ఉంటాడా ఏమిటి? మీడియా సంస్థలకు ఇట్లాంటి వార్తలు దొరికితే వదులు తాయా మరి. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు