హత్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో నిరసనల సెగ - రాహుల్ ను అడ్డుకుని కింద పడేసిన పోలీసులు

 


హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ,ఆయన సోదరి ప్రియాంక గాంధీలను పోలీసులు మార్గ మద్యంలో అడ్డగించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని సామూహికంగా వెళ్ళవద్దని పోలీసుల వారిని గ్రేటర్ నోయిడా వద్ద అడ్డగించారు. దాంతో వారు వాహనాలు దిగి కాలి నడకన వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. తానొక్కడినే వెళతానంటూ కార్యకర్తలెవరూ వెంట రారని చెప్పినా పోలీసులు వినిపించు కోకుండా రాహుల్ పై బల ప్రయోగం చేశారు. రాహుల్ ను ఓ పోలీస్ అధికారి గట్టిగా నెట్టి వేయగా రాహుల్ కింద పడి పోయిన దృష్యాలు నెట్ లో వైరల్ అయ్యాయి.  కింద పడి పోయిన రాహుల్ గాంధీని కాంగ్రేస్ పార్టి కార్యకర్తలు లేపి నిల బెట్టారు.  దాంతో దేశ వ్యాప్తంగా కాంగ్రేస్ పార్టి కార్యకర్తలు అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసుులు తనపై బల ప్రయోగం చేసారని లాఠీలతో కొట్టారని రాహుల్ గాంధి ఆరోపించారు. దేశంలో తిరిగే హక్కు లేకుండా చేసారని విమర్శించారు. ‘పోలీసులే నన్ను కిందకు తోసేశారు. నాపై లాఠీఛార్జ్ చేశారు. ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పాలి. రోడ్డుపై కేవలం మోదీయే నడవాలా? సామాన్యులు నడిచే హక్కు లేదా? మా వాహనాలు అడ్డుకున్నారు. అందుకే మేం  కాలి నడకన వెళుతున్నాం.’ అని రాహుల్ గాంధీ పోలీసులపై విమర్శలు గుప్పించారు. పోలీసుులు 

హత్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం ఉత్తర ప్రదేశ్  తీవ్ర ఆందోళనలకు దారి తీసింది.  రెండు వారాలక్రితం సామూహిక అత్యాచారానికి గురైన భాదితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ  మరణించగా పోలీసులు అర్ద రాత్రి దాటిన తర్వాత  తెల్లవారు జామున భాదితురాలి అంత్యక్రియలు జరిపించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిని పోలీసుల వైఖరిని తప్పు పట్టాయి.

దేశ వ్యాప్తంగా హత్రాస్ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. యోగి ఆదిత్యనాధ్ పాలనా తీరును ఎత్తి చూపుతూ భాదితురాలికి న్యాయం చేయాలని నిందితులను ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు