అల్లురామలింగయ్య 99 వ జయంతి - అల్లు స్టూడియో పనులు ప్రారంభం


 తెలుగు చిత్ర  రంగంలో హాస్యం పండించిన అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. 

తెలుగు చిత్ర సీమలో అల్లు రామలింగయ్య హాస్య పాత్రలతో ప్రత్యేకత చాటుకున్నారని అన్నారు. మెఘాస్టార్  చిరంజీవి ఆల్లు రామలింగయ్య గురించి ట్వీట్ చేసారు. ‘ఆయన పేరు గుర్తుకు రాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మామయ్య గారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్‌ కూడా. తత్వవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, నాకు మార్గదర్శి, గురువు, అన్నింటికి మించి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజు నాడు ఆయన శత జయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను.’ అని  చిరంజీవి ట్వీట్‌ చేశారు.

అల్లు అర్జున్ తన తాతయ్య జయంతి సందర్భంగా అల్లు పేరిట నిర్మిస్తున్న  స్టూడియో పనులు ప్రారంబిచారు.  గండిపేట సమీపంలో 10 ఎకరాల విశాల ప్రాంగణంలో స్టూడియోను అన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని అల్లు అర్జున్ చెప్పారు. 

మా తాతయ్య నట వారసత్వానికి గుర్తుగా ఆయన పేరిట అల్లు స్టూడియో నిర్మిస్తున్నాం..ఇందుకు సంభందిచిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ స్టూడియోను ఆయనకు అంకితం ఇస్తాం...మీ ఆశీస్సులు కావాలంటూ అల్లు అర్జున్ అభిమానులను కోరారు.

1922 లో జన్మించిన అల్లు రామలింగయ్య ఐదు దశాబ్జాల పాటు దక్షిమాదిలో  వేయికి పైగా సినిమాల్లో నటించారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం 1990 లో పద్మ శ్రీ అవార్డు ప్రదానం చేయగా  2001లో రఘుపతి వెంకయ్య  అవార్డు ప్రదానం చేసారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు