చనిపోయాడని ఫ్రీజర్ లో పెడితే 20 గంటల తర్వాత బతికాడు - తమిళనాడు లో జరిగిన ఘటన

 తమిళనాడు రాష్ట్రం లోని కంధంపట్టి గ్రామంలో జరిగిన ఘటన
కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం ఉందంటూ కేసు నమోదు చేసిన పోలీసులు


చాలా రోజులుగా మంచపై అనారోగ్యంతో ఉన్న బాలసుభ్రమణియ కుమార్  74 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడని ప్రీజర్ లో పెడితే 20 గంటల తర్వాత బతికిన ఘటన తమిళ నాడు రాష్ర్టం కంధం పట్టి అనే గ్రామంలో జరిగింది.  

ఈ  సంఘటన జాతీయ అంతర్జాతీయ మీడియాలో పెద్ద వార్తగా మారింది కాని ఇప్పుడా వార్త కుటుంబ సభ్యుల మెడకు చుట్టుకుంది. వైద్యులు నిర్దారించకుండా  బతికి ఉన్న వ్యక్తిని  చనిపోయాడని ఫ్రీజర్ లో ఉంచినందుకు పోలీసులు కేసు నమోదు చేసారు. 

అనారోగ్యంతో చాలా రోజుల నుండి మంచం పట్టిన కుమార్ శరీరంలోకదలికలు లేవని  చనిపోయి ఉంటాడని కుటుంబ సబ్యులు భావించారు. భందువులు అందరూ వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేసేందుకు బాడీని ప్రీజర్ ఉంచేందుకు ఫ్రీజర్ తెప్పించి అందులో ఉంచారు. బంధువులు అందరూ వచ్చిన  అంత్యక్రియలు జరిపేందుకు 20 గంటలు గడిచి పోయిన తర్వాత  ఫ్రీజర్ తెచ్చిన మనుషులు వచ్ిచ పైన ఉండే కవర్ ఓపెన్ చేయగా అందులో ఉన్న కుమార్ బాడీలో కదలికలు కనిపించాయి. దాంతో కుమార్ బతికే ఉన్నాడని నిర్దారణకు వచ్చి అతన్ని సేలం పట్టణంలో ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కుమార్ కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. 

అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనకు కారణం ఎవరనేది విచారిస్తున్నారు. మనిషి బతికిఉన్నాడా లేక చనిపోయాడా అని నిర్దారించడంలో కుటుంబ సబ్యుల నిర్లక్ష్యం ఉందని సూరమంగళం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ రాజశేఖరన్ తెలిపారు. కుటుంబ  నిర్లక్ష్యం పై సెక్షన్  287,336 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

ఈ ఘటనకు సంభదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ మెయిన్ స్ట్రీమ్  మీడియా పత్రికలు  ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. కుమార్ ఫ్ర్జర్ పక్కనే ఉన్న ఆయన సోదరుడు సరవరన్ ను స్థానికంగా ఓ తమిళ చానెల్  వీడియో జర్నలిస్టు ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ అయింది. వీడియో చిత్రీకరిస్తు ఫ్రీజర్ లో ఉన్న వ్యక్తి చేతులు కదులు తున్నాయని ఆ దృష్యాలు చూసి సరవరన్ ను ప్రశ్నించగా  అతనికి ఫిట్స్ ఉన్నాయని ఆయన సమాధానం చెప్పాడు. అయితే చనిపోయిన వ్యక్తికి ఫిట్స్ రావడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే  అతని ఆత్మ ఇంకా అతన్ని వీడలేదంటూ చెప్పిన సమాధానం వీడియో రికార్డు అయింది.ఈవీడియో బాగా వైరల్ కావడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిలో పడింది. అయితే అట్లా సమాధానాలు చెప్పిన  సరవరన్ మెంటల్ కండిషన్ పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని  అతని మెంటల్ కండిషన్ సరిగా ఉందో లేదో అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు.

Update:బాలసుబ్రమణియ కుమార్ ఆసుపత్రిలో వైద్యానికి స్పందించ లేదు. శుక్రవారం (17_10_2020) మరణించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు