టాంకు బండ్ పై బతుకమ్మలతో నిరసన తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

దేశం లో రాష్ట్రం లో మహిళలకు బాలికలకు రక్షణ లేదు ...సీతక్క

ఖమ్మంలో అత్యాచార యత్నం ఘటనలో పెట్రోల్ మంటల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన మైనర్ గిరిజన బాలిక

మహిళలపై అత్యాచార ఘటనలకు నిరసనగా టాంకు బండ్ పై ఎమ్మెల్యే సీతక్క నిరసన 


ఖమ్మంలో హింసాత్మక అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించి పెట్రోల్ మంటల్లో కాలి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న  13 ఏళ్ల గిరిజన బాలిక శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.  గిరిజన మైనర్ బాలిక పై హింసాత్మక  అత్యాచార యత్నం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరించిందని సీతక్క విమర్శిెంచారు. మైనర్ గిరిజన బాలికపై అత్యాచార యత్నం చేయగా బాలిక ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించగా 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో  28 రోజుల పాటు చావుబతుకుల మద్య పోరాడి మరణిించిందని అయినా సిఎం కెసిఆర్ నోరెందుకు మెదప లేదని సీతక్క ప్రశ్నించారు. మంత్రులు నోళ్లు ఎందుకు మూగ బోయాయని అన్నారు. నిరసనలో  బతుకమ్మలతో పాటు ప్లేకార్డులు కూడ ప్రదర్శించారు.

దేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని  సీతక్క అన్నారు. బిజెపి పాలనలో మహిళలపై అత్యాచారాల ఘటనలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని విమర్ళించారు. హథ్రాస్ ఘటన మోది పాలనకు యోగి పాలనకు సిగ్గు చేటని విమర్శించారు.

బతుకమ్మ అంటేనే మహిళల బతుకులకు సంభందించిన పండగని కాని రాష్ట్రంలో మహిళలు బతుకమ్మ పండగ జరుపుకునే రోజు  మహిళల అచ్యాచార ఘటనలపై నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసారు.
సీతక్కతో పాటు పలువుర మహిళా కాంగ్రేస్ నాయకులు పాల్గొన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు