భారత్ కాలుష్యం వెదజల్లే దేశమట...నోరుజారిన ట్రంప్

ఓ వైపు యుఎస్ ఇండియన్స్ ఓట్లు ఆశిస్తున్న ట్రంప్ మరో వైపు తన సహజ ధోరణిలో భారత్ ను ఎగతాలి చేస్తున్నాడు. ఓట్ల వేటలో మోదీతో చేతులు కలిపి ఇండియాలో రోడ్ షో కొచ్చిన విషయం బహుశ మరిచాడో లేక మతిమరుపో కాని ట్రంప్ భారత దేశాన్ని  కించపరిస్తే 
 అమెరికాలో ఉన్న ఇండియన్లను కూడ కించపరిచినట్లే.. మరి అమెరికాలో ఉండే బారతీయులు  ఊరుకుంటారా? ఇది ఆయనకే నష్టమని విశ్లేషకుల భావన






భారత్ పై మరో మారు యుఎస్ ప్రెసిడెంట్ నోరు జారారు. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగు దలకు చైనా, రష్యాలతో పాటు భారత్ కారణమని ఎగతాలి చేసారు.
ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్ధి బైడన్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్న ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకే నష్టదాయకమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఉత్తర కరోలినా ఎన్నికల ప్రచారంలో ప్రసంగిచిన
ట్రంప్ ఈ ఆరోపణలు చేశాడు.
ఆమెరికా మాత్రం తన పాలనలో పర్యావరణ ప్రయోజనాలు కాపాడుకుందని అట్లాగే శక్తివనరుల్లో స్వయం సమృద్ధి సాధించిందని గొప్పలు చెప్పుకున్నారు.

పర్యావరణ గణాంకాల విషయంలో తామే అత్యుత్తమమని చెపుతూ.. చైనా, రష్యా, భారత్‌ వంటి దేశాలు హానికర పదార్థాలను అతిగా విడుదల చేస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. అదే సమయంలో పర్యావరణ హితం కోసం  ప్లాస్లిక్‌ బదులుగా కాగితాన్ని వాడాలనే ఆలోచనను ఆయన ఎద్దేవా చేశాడని మీడియా వార్తలు వెల్లడించాయి.
బైడెన్‌ వలస విధానంపై విమర్శలు గుప్పిస్తు బైడెన్‌ వలస విధానం అమెరికా సరిహద్దులనే చెరిపివేసేదిగా ఉందన్నారు.

తాను అధ్యక్షుడైతే.. కోటిమందికి పైగా అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తామని ట్రంప్‌ ప్రత్యర్థి జో బైడెన్‌ ప్రకటించిన విషయాన్ని ఎత్తి చూపుతూ ఈ విమర్శలు చేశాడు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు