పివికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మాణం


వ్యతిరేకించిన ఎంఐఎం పార్టి
కాంగ్రేస్ సహా విపక్షాల మద్దతు

సభలో మాట్లాడనివ్వలేదని సీతక్క ఆగ్రహం


తెలంగాణ ముద్దు బిడ్డ మాజి ప్రధాన మంత్రి పి.వి నర్సింహారావుకు బారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మాణం చేశారు. ఎంఐఎం పార్టి వ్యతిరికేంచి వాకౌట్ చేయగా కాంగ్రేస్ సహా విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.  పీవీ నరసింహారావు సేవలను సభలో  కొనియాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన పివి నరసింహారావుకు లభించాల్సిన గౌరవం దక్కలేదని వారు పేర్కొన్నారు.పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ... తెలంగాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంఅయితే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టిఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మజ్లిస్ పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది. అయినప్పటికీ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టుగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సభను బుధవారానికి వాయిదా వేశారు.ఎంఐఎం తీరుపై, శాసనసభను వాయిదా వేసి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం కేసీఆర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. నిజం నిప్పులాంటిది అన్నారు. పీవీ నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదన మీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి ఇష్టం లేదనా, సడన్ గా అసెంబ్లీని వాయిదా వేసి వెళ్లిపోయారు అంటూ సీతక్క మండిపడ్డారు.స్వార్థ రాజకీయాల కోసం మహనీయుడి పేరు వాడుకుంటున్నారు అంటూ సీతక్క ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు మాజీ ప్రధానమంత్రి చేసిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పి.వి.నరసింహారావు మరణిస్తే కనీసం వెళ్లి నివాళులు కూడా అర్పించలేదు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కు పీవీ గుర్తు వచ్చారని ,సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఏడు సంవత్సరాల తర్వాత పీవీ నరసింహారావు గుర్తు వచ్చారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజకీయాల్లో కొడుకును ముఖ్యమంత్రిని చేసి, దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు