తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిది...బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో సంచలన హెచ్చరిక చేశారు. "ఇదే చివరి మహమ్మారి కాదు" అని జెనీవాలో ఒక వార్తా సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచం తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిది అని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి చెందడం, మహమ్మారులనేవి జీవిత సత్యాలని చరిత్ర మనకు చెబుతోందన్నారు.

మరో మహమ్మారి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఇప్పటి కంటే ప్రపంచం మరింత సన్నద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 8.8 లక్షల మందికిపైగా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు