జయప్రకాష్ రెడ్డి... అలెగ్జాండర్ నాటకం...ఓజ్ఞాపకం

జయప్రకాష్ రెడ్డి యాదిలో





 అది 2010 మే 20 వ తేదీ వరంగల్. . ఆరోజు ఉదయం హైదరాబాద్ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న ఐ.పీ.ఎస్ అధికారి డా. కాంతారావు నుండి ఫోన్ వచ్చింది. అప్పటికే వరంగల్ జిల్లా కేంద్రంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలైన శతరూప లో ప్రముఖ సినీ నటుడు,నాటక ప్రయోక్త జయ ప్రకాష్ రెడ్డి నాటకం ఉంటుంది. దానికి సరైన తేదీ, ఏర్పాట్లను చూడండి అని అప్పటి వరంగల్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఉన్న నాకు ఫోన్ లో చెప్పారు. జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ గా కూడా ఉన్న నేను శతరూప కార్యక్రమాలను హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణు మాధవ్ కళా ప్రాంగణంలో విజయ వంతంగా నిర్వహిస్తున్నాను. ఫోన్ వచ్చిన మూడు రోజుల అనంతరం, స్వయంగా జయ ప్రకాష్ రెడ్డి గారే హన్మకొండలోని మా ఆఫీస్ కు వచ్చారు. తానూ సినీ నటుడినైనా నాటక రంగమే నాకు ప్రాణమని, తానూ స్వయంగా రచించి, దర్శకత్వం వహించి నటించే సోలో ప్రదర్శన 'అలెగ్జాండర్' నిర్వహణకు సహకారమందించాలని వచ్చారు. అదేరోజు మా డీ.పీ ఆర్. ఓ ఆఫిస్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అలెగ్జాండర్ నాటక ప్రదర్శనపై వివరించారు. మాటలో మాటగా, మాదే జిల్లా అని అడిగితె, నల్లగొండ అని నినాదంతో ఒక్కసారిగా నన్ను కౌగలించుకొని నాదీ అదే వూరు అని. నా సినిమా ప్రస్థానం నల్లగొండ నుండే ప్రారంబమైదని చెప్పారు. వాళ్ళ నాన్న నల్గొండ ఏ.ఎస్.పీ గా ఉన్నప్పుడు తానూ నల్గొండలో ఉంది డా. రాజారావు నాటక సమితి అని పెట్టి ఎన్నో నాటకాలేసానని, ఒక కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ  రావు నా ప్రదర్శనను చూసి నాకు మొదటి సారిగా సినిమాలో అవకాశం ఇచ్చారని వెల్లడించారు.
   కాగా, ప్రెస్ మీట్ అనంతరం మధ్యాహ్నం మైక్రో ఆర్టిస్టుగా సుప్రసిద్దులైన అజయ్ కుమార్ ఇంటికి భోజనానికి వెళ్లి అదేరోజు సాయంత్రం  సాయంత్రం ఉన్న శతరూప కార్యక్రమాల ప్రదర్శనను వారితోనే ప్రారంభం చేయించి, స్టేజి ని చూపించి ఇంకా ఏ ఇతర ఏర్పాట్లు అవసరమో చెప్పా మన్నాను. వారి ప్రదర్శనకు అవసరాలను చెప్పారు. జూన్ ౩ వతేదీ ని తన ప్రదర్శన గా నిర్ణయించాను. అలెగ్జాండర్ నాటక ప్రదర్శన గురించి మంచి పబ్లిసిటీ ముందుగానే ఇవ్వడం, సినిమా లో మంచి లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండడంతో ఆ ప్రదర్శనపై నగర వాసుల్లో ఆసక్తి నెలకొంది.
        ఆ నాటక ప్రదర్శన ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్ర బీ.సి. సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య ముఖ్య అతిధిగా వచ్చి  ప్రారంభించారు. రిటైర్డ్ ఉప విద్యాశాధికారి, సాంస్కృతిక మండలి సభ్యులు బూర విద్యాసాగర్, పీ.వీ.మదన్ మోహన్, తిరునగరి నరేందర్, గడ్డం వెంకన్న, అడ్లూరి శివ ప్రసాద్, వేణుమాధవ్ లు కూడా పాల్గొన్నారు. తను ఈ అలెగ్జాండర్ నాటక ప్రదర్శనను ఎన్నో ప్రాంతాల్లో వేసినప్పటికీ కళలకు నిలయం, చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా పిలిచే వరంగల్ నగరం లో ప్రదర్శించడం తన జీవితంలో మరచిపోలేని సంఘటన అని జయప్రకాష్ రెడ్డి అన్నారు.
  ఇక, కేవలం వెయ్యి మాత్రమే ప్రేక్షకులు పట్టే కళా ప్రాంగణానికి ఆ నాటక ప్రదర్శన చూడడానికి దాదాపు మూడు వేలమంది వచ్చారు. సమాజంలో అవినీతి, అక్రమాలు, ఉద్యోగుల్లో లంచగొండి తనాన్ని ఒక రిటైర్డ్ సైనికాధికారి ఎలా ఎదుర్కుంటాడో, సగటు పౌరుడు ఎలా అంతమొందించాలో మంచి సందేశం తో ఉంటుంది ఈ అలెగ్జాండర్ నాటకం.
   మంచి కళాకారుడు, నటుడు, దర్శకుడు, సామాజిక స్పృహ ఉంది నల్లగొండ జిల్లాతో మంచి అనుబంధం ఉంది.


కన్నెకంటి వెంకట రమణ
పూర్వ జిల్లా పౌర సంబంధాల అధికారి
వరంగల్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు