కరోన సోకిన తల్లిని వ్యవసాయ భావివద్ద వదిలేసిన పుత్రులు

వరంగల్ అర్భన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో కరోన - కొవిడ్ 19  కేసులు రోజు రోజుకు పెరుగు తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా
కరోనా  కేసులు  పెరుగుతుడంతో గ్రామంలో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వైరస్ బారిన పడ్డ కుటుంబసభ్యులకు కనీసం అన్నం పెట్టేందుకు కూడా ఇతర కుటుంబసభ్యులు భయపడుతున్నారు. దీంతో రక్త సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలోనే గ్రామంలో మానవత్వం తలదించుకునే ఘటన జరిగింది. కరోనా వచ్చిందనే కారణంగా కన్న తల్లనే కనికరం లేకుండా ఊరిచివర వ్యవసాయ బావి వద్ద వదిలేసిన వైనం ప్రస్తుతం ప్రతీ మనిషినీ కంటతడి పెట్టిస్తోంది . నలుగురు కొడుకులున్నా.... నా అన్నవాళ్లు కరువై ఆ తల్లి పగలు రాత్రి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంది .
ఈ ఫోటోలో కనిపిస్తున్నపెద్దావిడ పేరు మారబోయిన లచ్చమ్మ . కొద్ది రోజులగా మంచానికే పరిమితమైంది . రెండ్రోజుల క్రితం మండలకేంద్రంలోని వేలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది . అంతే కొడుకులూ కన్న తల్లి అని చూడకుండా ఆస్పత్రి నుంచి సరాసరి లచ్చమ్మను వ్యవసాయ బావి వద్ద తీసుకెళ్లి వదిలేసారు . వైద్యం చేయిదాం అని ఓ కొడుకు అంటే మా దగ్గర డబ్బులు లేవని మరో కొడుకు ఇలా వారిలో వారే వాదులాడుకుంటున్నారు . దీంతో రెండ్రోజులుగా లచ్చమ్మ వ్యవసాయ బావి వద్ద విష సర్పాలు అడవి జంతువులమధ్యే జీవిస్తోంది . కాటికి కాలుచాపిన వయస్సులో కరోనా బారిన పడి మృత్యువుతో పోరాడుతోంది. ఆలనా పాలనా చూసేవాడు లేక . అన్నం పెట్టేవారుకూడా కరువై.... చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అదేం అని ఎవరైనా కొడుకులను ప్రశ్నిస్తే...  వైద్యానికి తమ వద్ద డబ్బులు లేవని కొడుకులు చేతులెత్తేశారు.
కాని వాస్తవిక పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది . వృద్ధురాలుకు నలుగురు కొడుకులలో  ఒకకొడుకు మృతి చెందగా మిగతా కొడుకులు ఆర్థికంగా ఉన్నవారే అని గ్రామస్తులు చెబుతున్నారు. కరోనాకు ముందు కూడా తల్లిని సరిగ్గా చూసుకోలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో కొడుకుల తీరుపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక లచ్చమ ఉన్న బావి పరిసర ప్రాంతాల్లోకి చుట్టుపక్కల రైతులు వెళ్లడం లేదని సామాజిక మాధ్యమాలలో  ప్రచారం కాగా గ్రామసర్పంచ్ మ్యాక రవీందర్ , ఎం పి టి సి సంపత్ , ఎ ఎం సి వైస్ ఛైర్మన్ రాంగోపాల్ రెడ్డి , ఎ ఎస్ ఐ ఉమాకాంత్ , కానిస్టేబుల్ శ్యామ్ కలుగ చేసుకుని ఒక కుమారుని ఇంటి చేర్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు