మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌


తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది.

ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు.

ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, పరీక్షల్లో కొవిడ్‌ నిర్ధరణ అయినట్టు తెలిపారు.

ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు సూచించారు.

సోమవారం నుంచి తెలంగాణ ఆసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

కరోనా నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకొంటూ కొవిడ్‌ నిబంధనల మేరకు శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.

సమావేశాలకు వచ్చే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు ప్రతి ఒక్కరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు.

మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కొవిడ్‌ రిపోర్ట్‌తోనే సమావేశాలకు రావాలని స్పష్టం చేశారు.

పాజిటివ్‌ వచ్చిన వారు రాకుండా ఉంటేనే మంచిదని, ఎవరైనా వస్తే వెనక్కి పంపిస్తామన్నారు.``` 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు