అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు ఎంత పన్నుచెల్లించాడో తెల్సా ? - బయట పెట్టిన న్యూయా ర్క్ టైమ్స్

 న్యూయార్క్ టైమ్స్ పై మండిపడిన ట్రంప్


అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తన వ్యాపార సంస్థలకు సంభందించిన లావాదేవీలలో అమెరికాలో కన్నా  ఇండియాకే అత్యధికంగా పన్నులు చెల్లించినట్లు  న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన వార్త ప్రచురించింది.  అంతేకాకుండా ట్రంప్  ఫెడరల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టారని ఎన్నో బిలియన్ డాలర్ల వ్యాపారాలను నడుపుతున్న ఆయన, 2016లో కేవలం 750 డాలర్ల పన్నును మాత్రమే యూఎస్ ప్రభుత్వానికి చెల్లించారని, ఆపై వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన తరువాత 2017లోనూ అంతే మొత్తాన్ని పన్నుగా కట్టారని ఆధారాలతో సహా ప్రచురించింది.

ఎన్నికలలలో హోరా హోరీగా ప్రచారం కొనసాగుతున్న  సమయంలో అసలే  ట్రంప్  తన ప్రత్యర్థి అయిన జో బైడెన్ తో  గట్టి పోటీ ఎదుర్కుంటున్న సమయంలో  న్యూయార్క్ టైమ్స్ ఇలాంటి వార్త ప్రచురించడం అమెరికాలో చర్చ నీయాంశంగా మారింది. ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ పై బాగా మండిపడుతున్న ట్రంప్ ఈ వార్తతో మరింతగా అగ్రహోదగ్రుడయ్యాడు. న్యూయార్క్ టైమ్స్  లో ప్రచురించిన వన్ని తప్పుడు కథనాలని ట్రంప్ తరపు న్యాయ వాది మీడియాకు చెప్పారు. ట్రంప్ పన్నులు ఎగ్గొట్టారనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. ట్రంప్ 10 ఏళ్ళలో బిలియన్ డాలర్ల పన్ను చెల్లించాడని అన్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రచిరించిన వార్తలో చాలా అంశాలు అవాస్తవమనవే ఉన్నాయని న్యాయ వాది పేర్కొన్నాడు.

గత 20 సంవత్సరాలుగా ట్రంప్ వ్యాపారాల లావాదేవీలకు సంభదించిన పన్నులు చిట్టాను పత్రిక సంపాదించింది. గడిచిని 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ట్రంప్ అసలు పన్నులే చెల్లించ లేదని పత్రిక వెల్లడించింది.  అంతేకాకుండా 2017లో ట్రంప్ నిర్వహిస్తున్న సంస్థలు ఇండియాకు 1,45,450 డాలర్లను పన్నుగా చెల్లించాయని, అమెరికాలో చెల్లించిన పన్నులతో పోలిస్తే, ట్రంప్ ఇండియాకే అధికంగా చెల్లించారని తెలిపింది.

అమెరికాలో అధ్యక్టపదవి చేపట్టిన వ్యక్తి తన ఆదాయ వ్యయాలను వెల్లడించే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. రిచర్డ్ నిక్సన్ అమెరికా అద్యక్షులుగా ఎన్నికైనప్పటి నుండి ఈ విధానం పాటిస్తున్నారు. అయితే ట్రంప్ అందుకు విరుద్దంగా తన ఆస్తులు ఆదాయ వ్యయాలు ప్రకటించక పోగా అడిగిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలంటూ కోర్టుకు వెళ్లారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు