మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్

 


రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా సోకింది. ఆయనకు తాజా వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మంత్రి వేణుగోపాలకృష్ణ ఇటీవలే సీఎం జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మంత్రి ధర్మానతో కలిసి రథం పనులకు ప్రారంభోత్సవం చేశారు.

దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయనతో గత పది, పదిహేను రోజులుగా కాంటాక్ట్‌లో ఉన్న, కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.

కరోనా వైరస్ భూతం సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కరోనా బారినపడ్డారు. పైడికొండల మాణిక్యాలరావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి నేతలు మరణించడం తెలిసిందే. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి కూడా కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం కరోనా ప్రభావానికి గురై కోలుకున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు