మాయమై పోయిన మానవత్వం - తండ్రిని చంపి పొలంలో పాతి పెట్టిన కొడుకు - సహకరించిన తల్లిభందాలు - అనుబందాలు - రక్త సంభంధాలు అన్ని మానవత్వానికి సవాలుగా నిలిచిన రోజులు ఇవి. ఆస్తి తగాదాలలో తండ్రితో తలెత్తిన గొడవలతో స్వంత కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేసి పొలలంలో పాతి పెట్టాడు. ఈ హత్యను కొడుకు ఒంటరిగా చేయ లేదు. అతని  తల్లి పూర్తిగా సహకరించింది.

ఈ దారుణమైన సంఘటన చేవెళ్ల మండలం గుండాలలో జరిగింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ హత్యా సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

గుండాలకు చెందిన క్రిష్టయ్య కుటుంబంలో గత కొన్ని రోజులుగా ఆస్తి తగాదాలు నెల కొన్నాయి. చాలా రోజులు తండ్రికి కొడుకుకు తల్లికి మద్య గొడవలు జరిగాయి.

నెల రోజుల క్రితం కృష్టయ్య హఠాత్తుగా మాయమయ్యాడు. భందువులు  ఎక్కడా వెదికినా ఆచూకి లభించ లేదు. కొడుకు, తల్లి ఇద్దరు తమకేమి తెలియనట్లు భందువులతో నటించారు. అయితే ఇంట్లో ఆస్తి తగాదాల విషయంలో గొడవలు వచ్చాయిని కొడుకే తండ్రిని ఏదో చేసి ఉంటాడనే అనుమానంతో భందువులు కొడుకును గట్టిగా మందలిచ్చారు. నిజం చెప్పక పోవడంతో నాలుగు తగిలించారు. దాంతో అతను అసలు నిజం అంగీకరించాడు. తండ్రి కృష్టయ్యను తానే తల్లితో కల్సి హత్య చేసి పొలంలో పాతిపెట్టానని గ్రామస్థుల సమక్షంలో ఒప్పు కున్నాడు. దాంతో అతన్ని పోలీసులకు అప్పగించడంతో పోలీసులు పొలంలో పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి పోస్టు మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తల్లి పాత్ర కూడ ఉంటే ఆమెను కూడ అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు