ఇండో-పాక్ బోర్డర్ లో వరంగల్ వాసి హల్ చల్ - ఫెన్సింగ్ దాటే యత్నంలో భద్రతా దళాలకు దొరికాడు

 


ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో  వరంగల్  ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మతి స్థిమితం లేని వ్యక్తి భద్రతా దళాలకు చిక్కి వారిని కొద్ది రోజులు గందర గోళ పరిచాడు.  మతి స్థిమితం లేక ఐ దేళ్ల క్రితం ఇంటి నుండి పారిపోయిన వరంగల్  జిల్లా ఖానాపూర్ కు చెందిన పరమేశ్వర్ (46) అనే వ్యక్తి ఈనెల 17న రాజస్థాన్ లోని  ఇండియా-పాక్ బోర్డర్ లో జైసల్మీర్‌ ప్రాంతంలోని పోచ్ఛా ప్రాంతంలో  చేరుకుని ఫెన్సింగ్ దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేసాడు.  ఫెన్సింగ్ కు కట్టిన గాజు సీసాల శబ్దం కావడంతో పరమేశ్వర్ ను భద్రతా దళాలు గమనించి అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని భద్రతా దళాలు మొదట ఐఎస్ఐ ఏజెంట్ గా భావించి చుట్టు ముట్టి తుపాకులు ఎక్కు పెట్టి చేతులు వెనక్కి విరిచి పట్టుకుని కాంపుకు తీసుకు వెళ్లి ఇంటరా గేట్ చేశాయి. మొదట పొంతన లేని సమాధానాలు చెప్పినా అతర్వాత తన ఊరు చిరునామా తన కుటుంబ సభ్యుల వివరాలు అన్ని వెల్లడించాడు. దాంతో భద్రతా దళాలు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చి నిర్దారించుకున్నారు. పరమేశ్వర్ చెప్పిన వివరాలన్ని నిజమేనని తెలియడంతో అతని తల్లి దండ్రులను రావాలని పోలీసుల ద్వారా సమాచారం ఇచ్చారు. 

  పరమేశ్వర్‌ సోదరుడు పుల్లయ్య అతడితో పాటు పరమేశ్వర్‌ బావ అనిల్‌ ఇద్దరూ  జిన్‌జిన్యాలీ ప్రాంతానికి చేరుకుని భద్రతా దళాలను కలిసాయి.

పరమేశ్వర్ కుటుంబ సబ్యులు చూపించిన ధృవీకరణ పత్రాలు చూసి భద్రతా దళాలు అతన్ని వారికి అప్పగించాయి. 

పరమేశ్వర్ ఇంటి నుండి తప్పి పోయి ఐదేళ్ళు అయిందని భార్య పిల్లలు ఉన్నారని ఆయన సోదరుడు పుల్లయ్య తెలిపాడు. హైదరాబాద్ లో ఉంటూ కనిపించిన రైళ్ళు ఎక్కి తిరిగే వాడని అట్లా తిరిగే అలవాటులోనే రాజస్తాన్ చేరుకున్నాడని ఆయన చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి వైద్యులకు చూపించి వైద్యం చేయిస్తామని తెలిపారు.

బార్డర్ దాటే యత్నంలో పరమేశ్వర్  భద్రతాదళాలకు చిక్కి ప్రాణాలతో బయట పడడం నిజంగా అదృష్టమే. బార్డర్ దాటే యయత్నంలో ఎవరు కనిపించినా భద్రతా దళాలు కాల్చి చంపుతాయి. పరమేశ్వర్ ను భద్రతా దళాలు ముందు ప్రాణాలతో పట్టుకోవాలని తుపాకులకు పని చెప్పక పోవడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు