అసెంబ్లీ సమీపంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం

ఫ్రస్టేషన్ తో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు అసెంబ్లి సమీపంలో రవీంద్ర భారతి ఎదుట గురువారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని జై తెలంగాణ అంటూ నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని చూసి సమీపంలో ఉన్న పోలీసులు వచ్చి నీళ్ళు చల్లి మంట లార్పారు. శరీరం 50 శాతం కాలిపోయింది. కాలిన గాయాలతో రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేసాడు. తనకు అన్యాయం జరిగిందని కెసిఆర్  ఏం చేయలేదంటూ చెప్పినట్లు వీడియోలో రికార్డు అయింది. తనకు బతకాలని లేదంటూ చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాలిన గాయాలతో ఉన్న అతన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి  చికిత్స జరిపిస్తున్నారు. తనది కడ్తాల్ అని పేరు  నాగులు అని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు