తెలంగాణ లో కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన అడిషనల్ కలెక్టర్

తెలంగాణ రాష్ట్రంలో లంచగొండి రెవెన్యూ అధికారుల రేంజి మామూలుగా లేదు. ముడుపుల్లో వరల్డ్ రికార్డు బ్రేక్ చేశారు. మొన్నతహశీల్ దార్ నాగరాజు అయితే ఈ రోజు ఓ అడిషనల్ కలెక్టర్ స్వయంగా కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయాడు. మెదక్ జిల్లా అడిషనల్  కలెక్టర్ గా పనిచేస్తున్న నగేష్ బుధవారం ఎసిబి అధికారులకు దొరికాడు. కోటి 12 లక్షల లంచం తీసుకోవడంతో పాటు కోటి రూపాల ప్రాపర్టి కూడ రాయించుకున్నాడు. నర్సాపూర్ డివిజన్ లోని తిప్పల్ తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ ఈ లంచాల ఒప్పందం చేసుకున్నాడు. నగేష్ ఇంటితో సహా రో 12 చోట్ల ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.
రెవెన్యూ శాఖలో కింది స్థాయిలో పనిచేస్తున్న విఆర్ వోలు అవినీతికి పాల్పడుతున్నారని మొత్తం వ్యవస్థనే రద్దు చేశారు. కాని ఇలాంటి ఉన్నతాధికారులు కూడ అవినీతి జలగలేనని ఇప్పుడు నగేష్ ఉదందంతో రుజువు అయింది. అఢినల్ కెలెక్టర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మద్యే  కొత్తగా ఏర్పాటు చేసారు. బంగారు తెలంగాణ లో లంచావతారాలు  ఏ స్థాయిల్లో ఉన్నారో జనాలకు బాగా అర్దం అవుతోంది.
గడీల పాలనలో అడిగే వారు లేక అధికారులు ఈరకంగా తెగబడ్డారు. మొన్నీ మద్యే తహశీల్ దార్ నాగరాజు భారి మొత్తంలో  లంచం తీసుకుంటూ పట్టు బడినా ఈ అధికారి మాత్రం  భయం అంటూ లేకుండా లంచానికి తెగ బడడం ఎసిబి అధికారులను విస్మయ పరుస్తోంది.

 సిఎం కెసిఆర్ చారిత్రక బిల్లుగా చెప్పుకుంటున్న కొత్త రవెన్యూ బిల్లు ఓ వైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలోనే  అడిషనల్ కలెక్టర్ ఇట్లా దొరికి పోవడం విశేషం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు