ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన ఐజీ ప్రమోద్ కుమార్


పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ పి.ప్రమోద్ కుమార్‌కు భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేసినట్లుగా శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఎంపికైన ప్రమోద్ కుమార్ 1991 సంవత్సరంలో డి.ఎస్పీగా పోలీస్ శాఖలో చేరి శిక్షణ అనంతరం మొదటగా సిరుపూర్ కాగజ్ నగర్ డి.ఎస్పీగా తొలిసారిగా భాధ్యతలు చేపట్టారు. అనంతరం డి.ఎస్పీగా కడప, కాచిగూడ ఎ.సి.పి పనిచేశారు. కడపలో ఫ్యాక్షనిస్టుల అదుపుచేయడంతో పాటు వారి నుండి సూమారు 270తుపాకులను స్వాధీనం చేసుకోవడం ప్రమోద కుమార్ కీలకంగా నిలిచారు. 1999 సంవత్సరంలో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు జిల్లా అడిషినల్ ఎస్పీగా పనిచేసి 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఇంటర్నేషనల్ పీస్ కీపర్స్ ఫోర్స్ విభాగంలో బోస్నియా, హెస్సిగొవియా దేశాల్లో హ్యూమన్ రైట్స్ చీఫ్ గా రెండు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం భారత్ కు తిరిగి వచ్చి నెల్లూరు అడిషినల్ ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటయిన సైబర్ క్రైం విభాగానికి తోలి ఎస్పీగా పనిచేశారు. 2002 సంవత్సరంలో ఐపిఎస్ హెదాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్

మెదక్, నిజమాబాద్ జిల్లాలో పనిచేసారు. తిరిగి 2005 సంవత్సరంలో మారోమారు ఐక్యరాజ్యసమితి తరుపున కోసావాలో 18 నెలలు పనిచేశారు. అక్కడి నుండి తిరిగివచ్చి మరోమారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేశారు. ఎస్పీగా బాలనగర్, ప్రకాశం జిల్లా అదిలాబాద్ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్యూరీటి విభాగాల ఎస్పీగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీగా పనిచేసే సమయంలో నక్సలైట్ల అణివేయడంతో పాటు, నిర్మల్, బైంసా రెండు మతాలకు మధ్య జరిగిన గొడవలను సద్దుమణగడం కోసం ఐజీ ప్రమోద్ కుమార్ తీసుకున్న చర్యలపై ఇరు మతాలవారు సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడంతో పాటు ఇరువర్గాల ప్రజలు కల్సి పండుగలను జరుపుకోనే స్థాయికి తీసుకరావడం జరిగింది. 2014 సంవత్సరంలో డి.ఐ.జీగా తెలంగాణ సెక్యూరిటీ విభాగంతో పాటు, హైదరాబాద్ సిటీపోలీస్ జాయింట్ కమిషనర్ స్పెషల్
బ్రాంచ్ విభాగంలో పనిచేసారు. 2017 సంవత్సరంలో కరీంనగర్ డీ.ఐ.జీగా బదిలీ అయ్యారు. 2019 ఐజీగా పదోన్నతిపై సి.ఐ.డీ విభాగానికి బదిలీ కావడంతో పాటు, కరీంనగర్, వరంగల్ రెంజ్ డి.ఐజీలుగా అదనపు భాధ్యతలు స్వీకరించడంతో పాటు గత జూన్ 31వ తేదిన వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఐజీ ప్రమోద కుమార్ అదనపు భాధ్యతలు చేపట్టారు. ఐజీ ప్రమోదకు మార్కు విధినిర్వహణలో భాగంగా ఇప్పటివరకు రెండు ఐక్యరాజ్యసమితి పతాకాలతో పాటు, ఒక ఇండియన్ పోలీస్ మెడల్, సేవపతాకాన్ని ప్రభుత్వం నుండి అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు ఐజీ ప్రమోద్ కుమార్ ఎంపికావడంతో పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది ఐజీకి అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు