దుక్కి టెడ్లు లేకుండా పొలం దున్నిన అక్కచెల్లెళ్ల కుటుంబానికి ట్రాక్టర్ సహాయం చేసిన .... సోనూ సూద్


సోనూ సూద్ స్పందించారు కాని ఎపి సిఎం జగన్ ఎందుకు స్పందిచ లేదో

అపద సమయాల్లో ఆదుకునే హృదయం సో నూ సూద్ ది. బాలివుడ్, టాలివుడ్ లో అనేక చిత్రాలలో నటించి మెప్పు పొందిన సోనూ సూద్ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ షభాష్ అనిపించుకుంటున్నాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ టమాటా  రైతు  ఇద్దరు కూతుర్లతో నాగలి పట్టి దున్నిన వీడియో బాగా వైరెల్ అయింది. పేదవాడైన రైతు కు ఎడ్లు కాని ట్రాక్టర్ కానిలేక పోవడంతో తాను విత్తనాలు వేస్తుండగా ఇద్దరు కూతుర్లు నాగలి లాగుతూ పొలం దున్నారు. ఈ వీడియో చూసిన  సోను సూద్ స్పందించి వీరికి ట్రాక్టర్ బహూకరించాడు. రెండు రోజుల్లో ట్రాక్టర్ వారి ఇంటి ముందు ఉండేలా షోరూం వారితో మాట్లాడి ఏర్పాట్లు చేసారు.
ముందు వారికి ఎడ్లు సమకూరుస్తానంటూ ట్వీట్ చేసారు ...ఆతర్వాత వారికి ట్రాక్టర్ ఇస్తున్నట్లు ట్వీట్ చేసారు.. సోమవారం నాటికి ట్రాక్టర్ సిద్దంగా ఉంటుందని పేర్కొన్నారు.
సోనూ సూద్ తెలుగు వారికి బాగా సుపరిచితం అయిన ఆక్టర్. అనేక తెలుగు సినిమాల్లో ఆయన ఎక్కువగా విలన్ పాత్రలు పాషించాడు.  ఆయన సినిమాలన్ని సంపూర్ణ విజయం సాధించాయి. లాక్ డౌన్  సమయంలో అనేక మంది వలస జీవులను ఆదుకున్న సోనూ సూద్ ఇలాంటి దృష్యాలు చూసినపుడల్లా చలించి పోతారు. భాదితులను వెంటనే ఆదు కుంటాడు.

సోనూ సూద్ సరే మరి ఎపి జగన్ ఎందుకు స్పందించ లేదో   ....

చిత్తూరు జిల్లా మదన్ పల్లి అక్కా చెల్లెల్ల పొలం దున్నిన దృష్యం చూసి ఎక్కడో ముంబైలో యున్న సోనూ సూద్ స్పందిస్తే ఎపి సిఎం జగన్ ఎందుకు స్పందించ లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ స్పందించి ఆదుకుంటే బాగుండేదని ఆయన అభిమానులు కూడ అభిప్రాయపడుతున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు