ఆపత్కాలంలో జర్నలిస్టుల అపన్నహస్తం-అల్లం నారాయణ

       
                                                   
కాలమే గతితప్పి...కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో చేసిన చాకిరీకి వేతనాలు రాక...కొందరు...వచ్చినా కొందరికి  కోతలు.... మరి కొందరికి అసలే  లేక.. అవస్థలు... తెలంగాణ లో జర్నలిస్టుల ఇబ్బందులు ఏమని చెప్పడం.. వార్తల సేకరణ పరుగుల పందెంలో ప్రాణాలను సైతం లెక్క చేయక వృత్తికి  అంకితమైన తెలంగాణ జర్నలిస్టుల  కోసం నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు అల్లం నారాయణ. తెలంగాణ మీడియా ఆకాడమి చైర్మన్ గా మరో వైపు తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్  అధ్యక్షులుగా తన పరిధిలో ఉన్న మేరకు సహాయపడుతున్నారు. 
కరోనా భారిన పడిన వారికి రాష్ర్టంలో ఇప్పటి వరకు 337 మందికి 59 లక్షల 30 వేల ఆర్థిక సహాయం చేసారు.
వీరిలో  పాజిటివ్ వచ్చిన 256 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలు అంద చేశారు.
ఆపత్కాలంలో నేనున్నానంటూ వెన్ను తట్టి ధైర్యం చెప్పి  ఆదుకుంటున్న అల్లం నారాయణకు తెలంగాణ జర్నలిస్టులు ముకులిత హస్తాలతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.


రాష్ట్రంలో ఇప్పటి వరకు  కరోన వైరస్ బారిన పడిన  337 మంది జర్నలిస్టులకు 59 లక్షల 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
★ వీరిలో  పాజిటివ్ వచ్చిన 256 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందచేసారు.  మొత్తంగా అందరికీ 59 లక్షల 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
 
★ జులై 27 (సోమవారం) నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా తాజగా 72 మందికి పాజిటివ్ రాగా , మరో నలుగురు జర్నలిస్టులు హోంక్వారంటైన్లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారు. ఈ 76 మంది జర్నలిస్టులకు 14 లక్షల 80 వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి  బాంకు అక్కౌంట్లలో జమ చేసినట్లు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపాలని తెలిపారు.మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

 ★ కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు