అంతా తాయత్తు మహిమ...బురిడి బాబా బాగోతం రట్టు


 బాబా గుట్టురట్టు రట్టు చేసిన పోలీసులు - కరోనా బాగు చేస్తానంటూ ఊదు పొగ తాయత్తులతో మోసాలు
               

కరోనా నయం చేస్తానంటూ జనాలకు తాయత్తలు కడుతూ డబ్బులు లాగుతున్న బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో  న్యూ హఫీజ్ పేట లోని హనీఫ్ కాలనీకి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ను అరెస్ట్ చేసినట్లు మియాపూర్ ఇన్స్ పెక్టర్ ఎస్ వెంకటేశ్ తెలిపారు.

వాట్స్ అప్ గ్రూపు ను క్రియేట్ చేసిన బాబా తన శిష్యులతో ఫోన్లు నెంబర్లు సేకరించి కరోనా నయం చేస్తానంటూ మెసేజ్ లు పంపి దర్గాకు రప్పించే వారు. మీరు దగ్గు, జలుబు, జ్వరం వొళ్లు నొప్పులతో  భాద పడుతున్నారా ? ఏం ఫర్వాలేదు...మాతాయత్తులు మెడకు కట్టుకుంటే చాలు అన్ని ఇట్లే మాయం అయిపోతాయంటూ ప్రచారం చేసి బాబా దగ్గరకు రప్పించే వారు. బోరుబండ, మియపూర్, హఫీజ్ పేట, మెహిదిపట్నం నుండి జనం పెద్దసంఖ్యలోనే బాబా దగ్గరకు వచ్చి తావీజులు కట్టించుకున్నారు. ఒక్కొక్కరి నుండి 12 వేల రూపాయయ నుండి 25 వేల వరకు బాబా వసూలు చేశాడని మెడకు ఓ తాయత్తు కట్టి ఊదు పొగ వేసే వాడని జనాలు చెప్పారు. దర్గాలో ప్రతి రోజు జనం రద్ది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ జరిపి గుట్టుంతా లాగారు.
కరోనా కు భయపడాల్సిన అవసరం లేదని తానిచ్చే తాయత్తు కట్టుకుంటే చాలు ముఖానికి మాస్కు కూడ కట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేయడంతో జనం ఎగబడ్డారు.
మూడనమ్మకాలపై ఇంకా జనాలకు నమ్మకాలు పోలేదనే కన్నా ఇలాంటి బురిడి బాబాల చరిత్ర ఇంకా సమిసి పోలేదు. దర్గాలను కేంద్రాలుగా చేసుకుని తాయత్తులపేరిట మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వారిని రాజకీయ నాయకులు కూడ ఆశ్రయించి తాయత్తులు కట్టించుకుంటూ పూజలు నిర్వహిస్తుండడంతో జనాలు కూడ ఎగ బడుతున్నారు.  కరోనా విళయం తాండవం చేస్తున్న తరుణంలో ఇలాంటి వేశాలు వేసే ఫకీర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తావీజ్ బాబాలను గడ్డం బాబాలను కరోనా రోగానికి ఆశ్రయిస్తే ఒళ్లు బాగు కావడం అటుంచితే ఇళ్లు గుల్లవడం మాత్రం ఖాయం. ఇలాంటివి దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే ఆమాయకులు మోస పోకుండా అపవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు