విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్ - ముంబై సెయింట్ జార్జ్ ఆసుపత్రి లో చికిత్స

వరవరరావు కుటుంబ సబ్యులు భయపడిందే జరిగింది.తలైజా జైళులో నిర్భంధంలో ఉన్న విరసం నేత వరవరావుకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ ఆయింది.జైలులో కరోనా పాజిటివ్ కేసులు  నమోదు కావడంతో గత కొద్ది రోజులుగా వివి కుటుంబ సబ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వివి ఆరోగ్య పరిస్థితులు బాగా లేవని ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించాలని కోరారు.జైలు అధికారులు  ముంబయిలోని తలైజా జైలులో ఉన్న వరవరరావును కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు.తలోజా జైల్లో ఉన్నప్పుడే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావుకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు నిర్వహించారు. దీంతో వరవరరావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ఈ నేపథ్యంలో జేజే ఆస్పత్రి నుంచి సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించారు.ప్రస్తుతం వర వర రావు ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పినట్లు కుటుంబ సబ్యుల ద్వారా తెల్సింది.
వరవరరావు ప్రస్తుతం ఎనిమిది పదుల వయసులో ఉన్నారు.మావోయిస్టులతో కల్సి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని వరవరరావుతో పాటు మరో నలుగురిని కొద్ది రోజులు గృహ నిర్భంధంలో ఉంచారు. మరికొద్ది రోజులు పూనే లొని ఎరవాడ జైలులో ఉంచారు.తర్వాత అక్కడి నుండి తలైజా జైలుకు తరలించారు.
వయసు పైబడి తరుచూ అనారోగ్యం భారిన పడుతున్న వర వరావును విడుదల చేయాలని కుటుంబ సభ్యులు పలుమార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకుండ పోయింది.కనీసం ఆతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చేసిన విజ్ఞప్తులు కూడ పట్టించు కోలేదు.వరవరరావు జైలు జీవితం గడపబట్టి ఏడాదిన్నర దాటింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు