ఎపి సిఎం ఉదారత - కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల సహాయం



కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు ఇవ్వాలని ఎపి సి ఎం జగన్ఆ దేశించారు. అట్లాగే
క్వారంటైన్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని ఫిర్యాదుల  స్వీకరణకు కాల్‌సెంటర్‌ నెంబర్‌తో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ పరీక్షలు, కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫీడ్‌బ్యాక్‌కు రోజూ క్వారంటైన్‌ కేంద్రం, ఆస్పత్రికి కాల్స్‌ చేయాలని సీఎం సూచించారు. క్వారంటైన్‌ కేంద్రాల పారిశుద్ధ్యం, భోజనంపై దృష్టి సారించాలన్నారు. ఆయా కేంద్రాలపై వారంపాటు డ్రైవ్‌ చేయాలని అధికారులకు జగన్‌ ఆదేశించారు. 
క్వారంటైన్‌ కేంద్రాల నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్‌ అన్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా కొవిడ్‌ పరీక్షలకు శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఎస్‌ఓపీ ప్రకారం కరోనా పరీక్షలు చేయాలని, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉండాలని నిర్దేశించారు. పరీక్షలు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా తెలపాలని సీఎం అన్నారు. 17వేల మంది వైద్యులు, 12 వేలమంది నర్సులను సిద్ధం చేసుకోవాలన్నారు. కరోనా కేసు వస్తే ఏ ఆస్పత్రీ చికిత్స నిరాకరించకూడదని, ఒక వేళ అలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు