నిలకడగా అమితాబ్ ఆరోగ్యం - కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన అమితాబ్


కుమారుడు అభిషేక్ బచ్చన్ సహా కోడలు ఆశ్వర్య రాయ్, మనవరాళు  ఆరాధ్య‌ సైతం ఆసుపత్రిలో చికిత్స


బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా
ఉందని నానావతి సూపర్ స్పెషాల్టి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీరిద్దరికి కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉండగా చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితులు చక్కబడ్డాయని తెలిపారు.   కోవిడ్ భారిన పడిన వీరిద్దరూ శనివారం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు అమితాబ్ కోడలు ఆశ్వర్య రాయ్, మనవరాళు  ఆరాధ్య‌ కోవిడ్ బారిన పడినట్లు ఆదివారం వైద్య పరీక్షఫలితాల్లో నిర్దారణ కావడంతో వారిద్దరిని నానావతి హాస్పిటల్ లో చేర్పించారు. అమితాబ్ కుటుంబంలో జ‌య‌బాదురి, ఆగ‌స్య నందా, న‌వ్య ల‌కు నెగ‌టివ్ టెస్ట్ రిపోర్ట్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

బిగ్ బికి కరోనా సోకిందని దేశ వ్యాప్తంగా ఆయన అబిమానులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు. టాలివుడ్ స్టార్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు అమితాబ్ ఆరోగ్యం కుదుట పడాలంటూ ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలో ఇతర జిల్లాలలో కంటే ముంబై మహానగరంలో  కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముంబై నగరంలో కోవిడ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 91745 కేసులు నమోదు కాగా ఇందులో 5244 మంది మరణించారు. చికిత్స పొందిన వారిలో 63431 మంది కోలుకున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు