తిరుమల లో శ్రీవారి దర్శనం యధాతధం- నో కంటైన్ మెంట్ జోన్ లో తిరుమల



తిరుమలలో శ్రీవారి దర్శనం ఎప్పటిలాగే యధావిధిగా కొనసాగనుంది. కరోనా కేసుల నేపద్యంలో చిత్తూరు జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ప్రకటించారు. జిల్లా కలెక్టర్ విడుదల చేసిన జాబితాలో తిరుమల కొండను మొదట చేర్చి ఆ వెంటనే తొలగించినట్లు వివరణ ఇచ్చారు.
ప్రతిరోజు 10 వేల మందికి దర్శనం కొనసాతుంది. తిరుమల కొండపై దేవస్థానం సిబ్బందిలో 80 మందికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ జరిగింది. ఆయితే దర్శనాలకు వచ్చిన  భక్తుల్లో ఎవరికి కరోనా సోకలేదని అధికారులు ప్రకటించారు. మార్చి 20 నుండి కరోనా లాక్ డౌన్ నేపద్యంలో ధర్శనాలు నిలిపి వేశారు. అనంతరం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మే నెల 7 నుండి తిరిగి ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మొదట్లో  రోజుకు 6000 దర్శనాలు ఆ తర్వాత 12 వేల దర్శనాలకు అనుమతించారు. అయితే కరోనా కేసులు నమోదు కావడం టిటిడి లో కల కలం కలిగించింది.
శ్రీవారి దర్శనాలు కొనసాగిస్తారా లేక నిలిపివేస్తారా అనే సంశయాలు తలెత్తాయి. సుదీర్ఘ చర్చల అనంతరం దర్శనాలు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆలయానికి భక్తుల కానుకల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గి పోయింది. గతంలో రోజుకు సుమారు 60 వేల నుండి 80 వేల వరకు భక్తులు వచ్చే వారు. ప్రతి నెల సరాసరి 150 కోట్ల నుండి 200 కోట్లవరకు ఆదాయం సమకూరేది. ఇప్పుడా పరిస్థితి లేదు. తిరిగి దర్శనాలు ప్రారంభమైన మే నెల 7 నుండి ఇప్పటి వరకు (జూన్ 30 వరకు) కేవలం 14 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు