భారత్ కు వైద్య రంగ నిపుణుల ప్రశంసలు-- ప్రధాన మంత్రి నరేంద్ర మోదికరోనా కట్టడిలో భారత దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది అన్నారు.ప్రతి ఒక్కరూ కరోనా నిభందనలు పాటిస్తే చాలా వరకు నష్టం నివారించ వచ్చని పేర్కొన్నారు. మాస్కులు లేకుండా ప్రజలెవరూ బయటకు రావద్దని మోదీ పిలుపు నిచ్చారు.ఇతర దేశాలతో పోలిస్తే  దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉందని అన్నారు.'ప్రతి ఒక్కరి ప్రాణం..విలువైనది..అందువల్ల అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి'అని సూచించారు.కరోనా వ్యాప్తి,లాక్‌డౌన్ అంశాలపై 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు.మాస్కు ధరించడం వల్ల మీతో పాటు మీ పక్కవాళ్లకు కూడా మంచింది. మార్కెట్లు తదితరాలు తెరుచుకున్న తరుణంలో ఇది తప్పనిసరి. కరోనా వ్యాప్తి నివారణ కోసం భారత్ తీసుకున్న చర్యలను వైద్య రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది అని ప్రధాని పేర్కొన్నారు.

మూడున్నర లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు దేశంలో 3,44,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,54,037 యాక్టివ్ కేసులున్నాయి. 1,80,589 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 9,925 మంది మరణించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు