వీరుడా నీకు వందనం..కల్నల్ సంతోష్ తెలంగాణ బిడ్డ

హైదరాబాద్ కు బదిలి అయినా
లాక్ డౌన్ కారణంగా సరిహద్దులోనే ఉండి పోయిన సంతోష్ బాబు
ఏడాది కాలంగా గాల్వాన్ లోయలో విధులు

బారత్ చైనా సరిహద్దు లో గాల్వన్ లోయ వద్ద జరిగిన ఇరు దేశాల సైనికుల పరస్పర బాహా బాహిలో వీర మరణం పొందిన కల్నల్ బి.సంతోష్ బాబు  తెలంగాణ బిడ్డ.సూర్యపేట జిల్లా కేంద్రానికి చెందిన వాడు.సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ లో తల్లిదండ్రులు,ఢిల్లీలో భార్యా పిల్లలు ఉన్నారు.భార్య పేరు సంతోషి,కుమార్తె అభిజ్ఞ(9),కుమారుడు అనిరుధ్‌(4),తల్లిపేరు మంజుల.భార్య పిల్లలు డిల్లీలో ఉంటుండగా తల్లి సూర్యపేటలో ఉంటున్నారు.కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన వార్తతో సూర్యపేటలో విశాద ఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం తన కుమారుడు ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందని దుఖ్ఖితురాలైన తల్లి మంజుల పేర్కొంది.బీహార్ 16వ బెటాలియన్ లో సంతో్ష్ బాబు పనిచేస్తున్నాడు.ఏడాదిన్నర కాలంగా లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయ లో విధులలో ఉన్నాడు. ఇటీవలె సంతోష్ బాబుకు హైదరాబాద్ కు బదిలి కాగా లాక్ డౌన్ కారణంగా అక్కడే నిలిచి పోయారు.మే నెల మొదటి వారం నుండి ఇండియా చైనా బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. సోమవారం రాత్రి  గాల్వన్ లోయలో చైనా సైనికులు రాళ్లు రువ్వడంతో బారత సైనికులు కూడ ఎదురు దాడితో జవాబు చెప్పారు. చైనా వైపు ఎంత మంది సైనికులు చనిపోయారనే విషయం ఆ దేశం ప్రకటించక పోయినా ప్రాణ నష్టం జరిగిందని చైనా అధికారిక పత్రిక గ్లోబర్ టైమ్స్  చ్వీట్ చేసాడు.చైనా వైపు కూడా భారీగానే నష్టం వాటిల్లిందని గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ హు జిజిన్ చేసిన ట్వీట్‌ను బట్టి అర్థమవుతోంది. ‘‘నాకు తెలిసిన సమాచారం ప్రకారం గాల్వాన్ లోయలో తలెత్తిన బాహాబాహీలో చైనీస్ వైపు కూడా నష్టం వాటిల్లింది.భారత్‌కు నేనొకటి  చెప్పదలచుకున్నాను. భారత్ దురహంకారంతో వ్యవహరించొద్దు, చైనా సంయమనాన్ని బలహీనమని తప్పుగా అర్థం చేసుకోవద్దు’’ అని హు ట్వీట్ చేశారు.

కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన విధుల్లో ఉన్నారు. తన సర్వీస్‌లో ఎక్కువ కాలం కాశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించారు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు. 37 సంవత్సరల చిన్న వయసులో కల్నల్‌గా పదోన్నతి పొందాదారు. 2007లో పాకిస్తాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటు దారులను అంతమొందించారు.

1975 తర్వాత ఇండియా చైనా బార్డర్ లో సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి.అరుణా చల్ ప్రదేశ్ లో గస్తీ కాస్తున్న భారత సైనికులపై చైనా సైనికులు  మెరుపు దాడి చేసారు.ఈ దాడిలో నలుగురు భారత సైనికులు వీరమరణం పొందారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు