ఒకే రోజు బడ్జెట్- బిల్లులన్నిపాస్-వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం- విపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆక్షేపం

అంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభ మయ్యాయి.శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.అభివృద్ధి వికేంద్రీకరణ,అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు,సీఆర్డీఏ రద్దు బిల్లు,దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది.వీటితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది.స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఎక్సైజ్‌ సవరణ బిల్లు, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఉన్నత విద్యాకమిషన్ సవరణ బిల్లు,2020 ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. 
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి,మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

చంద్రబాబు ఆక్షేపం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత,ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు.మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు మళ్లీ తీసుకురావటం తప్పుడు విధానమని చంద్రబాబు విమర్శించారు.శాసన మండలి ఇప్పటికే సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లులను మళ్లీ ఎలా తెస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.మండలిలో మళ్లీ గట్టిగా పోరాడతామని, ఈ బిల్లులపై పోరాటంలో తమకు రెండో ఆలోచనే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు