లాక్ డౌన్ ఎఫెక్ట్ - తెలంగాణలో స్కిల్డ్ అన్ స్కిల్డ్ పని వారికొరత

ఎక్కువ శాతం ఉపాధి మార్గాలు చూపుతున్న గృహ నిర్మాణ రంగంలో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి.నైపుణ్యం గల పని వారి కొరత తీవ్రంగా ఏర్పడింది. నైపుణ్యత లేని పని వారి కొరత కూడ తీవ్రంగానే ఉంది.రెండు నెలల వరకు కొనసాగిన లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల పనులు లేక పస్తులు ఉండలేక ఇతర రాష్ర్టాల నుండి వచ్చిన లక్షలాది మంది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లి పోయారు.లాక్ డౌన్ కాలంలో వారి అవసరాలు గుర్తించి ఆదుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.నిర్మాణ రంగంలో ఉన్న బిల్డర్లు కాంట్రాక్టర్లు ఎవరూ పట్టించు కోలేదు.మామూలుగా కూలి ఇచ్చి పనులు చేయించుకునే ఇండ్ల నిర్మాణ యజమానులు కూడ వారికి సహాయం చేసేందుకు ముందుకు రాక పోవడంతో ఒరిస్సా,ఉత్త్రర ప్రదేశ్,బీహార్,రాజస్థాన్ వంటి రాష్ర్టాల నుండి వచ్చిన కూలీలు పెట్టే బేడా సర్దుకుని ఠికానా ఎత్తి వేసి  తిరిగి వెళ్ళి పోయారు.
ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తి వేయడంతో ఇండ్ల పనులు మొదలు పెట్టేందుకు పని వారి కొరత ఏర్పడింది.గత 20 ఏండ్ల కాలంలో లక్షలాది మంది  ఉత్తారాది రాష్ర్టాల నుండి ఇక్కడికి వచ్చిన సెంట్రింగ్,ఎలక్ర్టిషియన్, ప్లంబర్, తాపి,మార్బుల్, టైల్స్ పరిచే మేస్ర్తీలు తిరిగి వెళ్ళి పోవడంతో గృహ నిర్మాణ రంగంలో పనులు పుంజు కోలేక పోతున్నాయి.గుత్తేదారులు కార్మికులను తిరిగి రావాలని కోరుతున్నా వారు రావడం లేదని చెబుతున్నారు. ప్రయాణాల్లో అటు, ఇటు తిరిగిన కార్మికులలో ాలా మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో తిరిగి వచ్చేందుకు ఇష్ట పడడంలేదని గుత్తేదారులు చెబుతున్నారు.స్థానికంగా స్కిల్డ్, అన్ స్కిల్డ్ పని వారు లేరనేది కాదు కాని ఇక్కడ ఉన్న వారితో సరి పోదు. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలంటే ఇతర రాష్ర్టాల నుండి కార్మికులు రావాల్సిందే నని గుత్తే దారులు అభిప్రాయ పడుతున్నారు.కరోన గడబిడ తగ్గే వరకు గతంలోలోగా ఇండ్ల నిర్మాణ రంగం ఇప్పుడప్పుడే పుంజుకునే పరిస్థితి లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు