అదిగో అల్లదిగో శ్రీ హరి వాసము...ఈనెల 11 నుంచి భక్తులకు దర్శనం

ఈనెల 11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం
8,9,10 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో శ్రీవారి దర్శనాలు ట్రయన్‌ రన్‌
రోజుకు 7 వేల మందికి దర్శనం
ఉ.6.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు దర్శనానికి అనుమతి
10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు
10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 8,9న ట్రైయిల్ రన్ నిర్వహిస్తామన్నారు.ఈ నెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని అనుమతిస్తామన్నారు. భక్తులు ఆరు అడుగులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.కంటైన్ మెంట్ ఏరియాల్లో నివసించే భక్తులు దర్శనానికి రావద్దని సూచించారు.

క్యూలైన్‌ కదలికను గుర్తించేందుకు 100 మంది టిటిడి ఉద్యోగులతో శుక్రవారం శ్రీవారి ఆలయంలో అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పరిశీలించారు ఈ ట్రాయల్ రన్ పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి  మాట్లాజుతూ ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటలలోపు దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు.రోజుకు 7 వేల మందికి దర్శనం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదని కాలినడక భక్తులకు ఉ.6 నుంచి సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు.అట్లాగే విఐపిలకు ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందని చెప్పారు.పుష్కరిణిలో భక్తులకు అనుమతి లేదని అలాగే కరోనా తీవ్రత కారణంగా అంటు వ్యాధులు ప్రబల కుండా కల్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు