మీరా చోప్రాను వేధించిన వారిపై సైబర్ క్రైం పోలీసుల కేసుమీరా చోప్రాను వేధిస్తు ట్వీట్లు చేసిన వారిపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పేరిట మీరా చోప్రాను  ఆసభ్యకర పదజాలంతో వేధించిన వారి ట్విటర్ అకౌంట్స్ ని గుర్తించి వారిపై 67ఐటీ యాక్ట్,509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.వారి ట్వీట్లను పోలీసులు తొలిగించారు.అయితే ట్వీట్లు చేసిన వారు నిజంగా ఎన్టీ ఆర్ ఫాన్సా కాదా అనే విషయాలు నిర్దారణ కావల్సి ఉంది.జూన్ 1నుండి మీరా చోప్రాకు ఎన్టీఅర్ ఫాన్స్ గా చెప్పుకున్న వారికి మద్య ట్విట్టర్ లో మాటల యుద్ధం జరిగింది. తెలుగు,హింది, తమిళ చిత్రాల్లో నటించిన మీరా చోప్రా తన అభిమానులతో చర్చిస్తున్న సందర్భంగా ఒకరు ఎన్టీఆర్ గురంచి అభిప్రాయం ఆడిగారు. అయితే ఎన్టీఅర్ ఎవరో తనకు తెలియదని మీరా చోప్రా చెప్పినందుకు ట్వీట్లతో ట్రోలింగ్ ప్రారంభించారు. అభ్యకరంగా ట్వీట్లు చేసారు. దాంతో మీరా చోప్రా పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు ఐ.టి,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావుకు అట్లాగే ఆయన సోదరి కవితకు మీరా చోప్రా ట్వీట్ చేసారు.గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని,యాసిడ్‌ దాడి చేస్తామంటూ బూతులు తిడుతున్నారన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీరా చోప్రా కోరారు.అందుకు స్పందించిన కెటిఆర్ మేడం..ఈ విషయం నా దృష్టికి వచ్చింది.మీ ఫిర్యాదు ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ,హైదరాబాద్‌ సీపీకి ఆదేశించాను అని రి ట్వీట్ చేశారు.మహిళల భద్రతకు భంగం కలిగించి వ్యక్తులను స్వేచ్ఛగా వదిలి వేయవద్దని మీరా చోప్రా పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించటం లేదో అర్దం కాదు
ఇంత జరిగినా జూనియర్ ఎవ్టీఆర్ మాత్రం నోరు మెదపక పోవడం విచారకరం.అసలు అసభ్యంగా ట్వీట్ చేసిన వారు నిజంగా జూనియర్ ఎన్టీ ఆర్ ఫాన్సేనా కాదా..అయితే ఎందుకు వారించ లేదు..కాక పోతే తన ఫాన్స్ కాదని ఎందుకు ప్రకటించ లేదనే విషయాలు ప్రశ్నార్దకం. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు