పసుపు వల్ల ప్రయోజనాలెన్నో ?

పసుపు వాడితే పది కాలాల పాటు  మనుషుల ఆరోగ్యంకూడ పదిలం 
పసుపు ఎక్కడ లభిస్తుందంటే మన వంటింట్లో..పసుపులేని వంటిళ్లు దాదాపు ఉండదు.పసుపు అల్లం కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయనామం ‘కుర్కుమా లాంగా’.ఇది భారత ఉపఖండం మరియు ఆగ్నేయాసియాకు చెందినది.మనకు పసుపు చేసే మేలు తెలిస్తే ఆశ్చర్య పోతాం.పసుపును శరీరంపైన లేపనాలుగాను గాను తీసుకునే  ఆహారంలో కూడ విరివిగా వాడవచ్చు.పసుపు మంచి యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మన చర్మంపై ఉన్న సమస్యలను తగ్గించి దానికి మెరుపును తీసుకొస్తుంది.దీనికి బియ్యపు పిండిని చేర్చడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు, దుమ్ముధూళి వంటివన్నీ మాయమైపోతాయి. పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్ ఇది యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడుతుంది.పసుపులో ఉండే అతి ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్.దీన్ని ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగిస్తారు.కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి ఒకటి. పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది. పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఇది డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది .ఈ సమ్మేళనం డయాబెటిక్ న్యూరోపతిని కూడా నివారించగలదు.
పసుపు మధుమేహం సంబంధిత లోపాలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడికి చికిత్స చేస్తుంది.కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాకుండా, రక్తంలో అధిక కొవ్వు స్థాయిని నియంత్రిస్తుంది.
మెట్‌ఫార్మిన్ (టైప్ 2 డయాబెటిస్‌కు వాడే మందు) ను పసుపుతో పాటూ తీసుకున్నప్పుడు గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని కొన్ని పరీక్షల్లో నిర్దారణ జరిగింది. అయితే ఇంకా విస్తృతంగా పరిశోదనలు జరగాల్సి ఉంది.
పసుపులో  అత్యధికంగా మాంగనీసు,ఇనుము, పోటాషియం  వంటి ధాతువులతో పాటు ఇఁతర ధాతువులు కూడ ఉంటాయి.పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు నివారణ కొరకు విస్తృతంగా ఉపయోగిస్తారు. దానిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియు యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని ఎన్నోఅధ్యయనాలు పేర్కొన్నాయి.
పసుపును ఇంకా ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించ వచ్చంటే పాలలో కలుపుకుని తాగవచ్చు. పసుపు టీ చేసుకుని  సేవించవచ్చు. ఉదయం పడి గడుపున కొద్ది కొద్దిగా  పసుపు గుళికలు తీసుకుంటే శ్వాస సంభందిత వ్యాధులు తగ్గి పోతాయి. అయితే ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అతిగా తీసుకుంటే ఏదైనా ప్రమాదమే. వరుసగా తీసుకోకుండా మద్యలో కొద్ది రోజులు విరామం ఇస్తు తీసుకోవచ్చు. మన దేశంలో (ఇండియా) లో తినే ఆహారం వంటల్లో తప్పకుండా వేస్తాం కనుక ప్రత్యేకంగా పసుపును నేరుగా వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని అనారోగ్య సమస్లు తలెత్తితే ఆయుర్వేద వైద్య నిపుణుల సూచనలు సలహాలు పాటించి వాడుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు