దగ్గు మందుకంటూ అనుమతులు- కరోనాకు మందంటూ ప్రకటన-రాందేవ్ బాబా కరోనా ఔషధ వివాదం

బాబారాందేవ్
యోగా గురువు బాబా రాం దేవ్ కరోనా ఔషధం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఔషద తయారి ప్రామాణికతపై కేంద్రం అనేక ప్రశ్నలు తేవనెత్తింది. దగ్గు మందుకుంటూ అనుమతులు పొంది కరోనా మందంటూ ప్రకటించారని కేంద్రం విస్మయం ప్రకటించింది.
కరోనా మహమ్మారి మృత్యువై కబలిస్తున్నవేళ తాను మందు కునుక్కుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలా అంటూ రాందేవ్ బాబా ఓ వైపు అవేదన చెందారు. ఈ వివాదం ఎట్లా సమిసి పోతుందో ఔషధం విడుదల అవుతుందో లేదో అని బాబా మీద ఆపార నమ్మకం కలిగిన వారు మరో వైపుఎదురు చూస్తున్నారు.
బాబా రాందేవ్ కేంద్రానికి ఓ పెద్ద వివిఐపి. అంతకు మించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యంత కీలక వ్యక్తి.ఆయనకు ప్రభుత్వ పరంగా సాగర సత్కారాలు ఉంటాయి. ప్రధాన మంత్రి సైతం అయన మాట కాదనరనే ప్రచారం ఉంది.కాని బాబా రాందేవ్ కరోనా ఔషధం విషయంలో కథ అడ్డం తిరిగింది.అసలు కరోనాకు మందు ఎలా ఎక్కడ తయారు చేసారు..మాకు మాట మాత్రంగా కూడ ఎక్కడా చెప్పలేదు..అంటూ  కేంద్రం అడ్డుకుంది.
ఎలాంటి అనమతులు పొందారో తమకు సమర్పించాలని కేంద్రం నుండి తాఖీదు అందడంతో ఇది బాబా రాం దేవ్ కు ఆయన స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థకు అవమాన కరమని పతంజలి కార్పోరేట్ సంస్థ విచారంలో పడి పోయింది. కరోనాకు మందు కునుక్కుంటే కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందో నని  బాబా రాం దేవ్ ను ఫాలో అయ్యే ఆయుర్వేదికులు అభిమానులు కూడ తెగ భాద పడిపోతున్నారు.రాం దేవ్ బాబా కూడ ఇది తనకు తన సంస్థకు అవమానంగా భావిస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోది ఓ వైపు ఆయుర్వేద వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే ఇవేం అడ్డంకులంటూ ఒకింత మండి పడ్డారు కూడ.
కోరోనిల్‌లో 150 వరకు క్రియాశీల పదార్థాలు ఉన్నాయని తమ క్లినికల్ ట్రయల్స్ లో వైరస్ తగ్గిందని ..ఇందులో ఎలాంటి మాయ లేదని Indian Council of Medical Research- (ఐసీఎంఆర్) క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ (సీటీఆర్ఐ),ఎతిక్స్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే జైపూర్ నిమ్స్ వద్ద అధ్యయనం ప్రారంభించామని రాందేవ్ బాబా తెలిపారు.

అయితే అసలు కథ ఇక్కడే ఉంది. బాబా రాం దేవ్ పెద్ద యోగా గురువే కావచ్చు.అయుర్వేద వైద్యంలో అయనకు  దేశ విదేశాల్లో పెద్ద ఫాలోయింగే ఉండవచ్చు కాని కేంద్ర ప్రమాణాలు పాటించకుండా ఔషదం తయారు చేస్తే అందులో కరోనా ఔషదం..అయ్యే సరికి కేంద్రం అడ్డుపడాల్సి వచ్చిందంటున్నారు.

అన్ని ప్రమాణాలు పాటించామని బాబారాందేవ్ చెబుతుండగా అసలు కరోనా మందంటూ తమకు సమాచారం కూడ ఇవ్వలేదని కేవలం రోగ నిరోధకశక్తి పెంపొందడానికి,దగ్గు,జ్వరం నియంత్రణకు మాత్రమే తాము ఆ మందుకు అనుమతి ఇచ్చామనిఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ఆయుర్వేదశాఖ అధికారులు మీడియాకు వివరణ ఇచ్చారు.

పతంజలి ఆయుర్వేద సంస్థ ‘కొరోనిల్‌, స్వసరి’పేరిట కిట్ తయారు చేసింది. కోరోనిల్ కోసం పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న సమయంలో ‘కరోనా వైరస్‌’ పేరును ప్రస్తావించలేదని  ఉత్తరాఖండ్ రాష్ర్ట అయుర్వేద శాఖ అధికారులు సెలవిచ్చారు.దీనిపై పతంజలి సంస్థను వివరణ కోరతామని.. నోటీసులు జారీ చేస్తామని.. కొవిడ్‌-19 కిట్‌కు ఎలా అనుమతి లభించిందో విచారణ జరుపుతామంటూ లైసెన్స్‌ అధికారి స్పష్టం చేసారు.తాము ఆయుష్‌ మంత్రిత్వశాఖ నిర్దేశించిన అన్ని ప్రమాణాలు నూటికి నూరు శాతం పాటించామని పతంజలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

వైరస్‌కు సంబంధించి ఐసీఎంఆర్ క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ (సీటీఆర్ఐ) ఆమోదం తీసుకొని డ్రగ్ రూపొందించామని,కానీ ఆయుష్ మంత్రిత్వశాఖను కమ్యునికేట్ చేయకపోవడంతో వివాదం చెలరేగిందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ సంస్థల మధ్య సమాచారం ఇవ్వడంలో లోపమే తప్ప..తమ సంస్థ తప్పు చేయలేదని స్పష్టంచేశారు.
ఈ వివాదం ఎక్కడ ముగుస్తోందో కేంద్రం ఏం ప్రకటన చేస్తుందో కాని అప్పటి వరకు కరోనా ఔషదం మార్కెట్ లోకి  విడుద లయ్యే పరిస్థితి లేదు.
గతంలో బాబా రాందేవ్ పతంజంలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన ఔషధాల విషయంలో పలు మార్లు వివాదాలు తలెత్తాయి. మగ సంతానం కోసం మందు అంటూ బాబా రాం దేవ్ ఇచ్చిన వాణిజ్య ప్రకటనలు వివాదానికి కారణమయ్యాయి. దాంతో ఆ మందు ప్రకటనను మార్చి బలవర్దక మైన ఔషధంగా మార్కెట్ లోకి ప్రవెశ పెట్టారు. ప్రస్తుతం కూడ కోరోనిల్ ఔషధం పేరు మార్చి కరోనా పేషంట్లకు ఇమ్యూనిటి పెంచే ఔషధంగా మార్కెట్ లోకి ప్రవేశ పెట్టే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఒక వేళ బాబా రాం దేవ్ ప్రకటించినట్లు ఈ ఔషధం కరోనాకు విరుగుడే అయితే దేశంలో పేద వారికి నిజంగా సంజీవినే అవుతుంది.
ఎందుకంటే అనేక  అల్లోపతి ఫార్మాసూటికల్ కంపెనీలు కరోనా పేరిట వేల రూపాయల ఖరీదు చేసే ఔషధాలు మార్కెట్ లో విడుదల చేసేందుకు క్యూలు కడుతున్న తరుణంలో కేవలం 545 రూపాయల ధరతో లభించే పతంజలి ఔషదం నిజంగా దివ్య ఔషధమే అవుతుందని భావించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు