శాంసంగ్ కు చెందిన ఏ80 స్మార్ట్ ఫోన్ మాడల్ పై ఏకంగా రూ.30 వేల భారి తగ్గింపు ప్రకటించింది
శాంసంగ్ ఏ80 |
ఒక సారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు చూద్దాం..ఇందులో 6.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే ఉంది.ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది.అయితే దీని బ్యాటరీ సామర్థ్యం మాత్రం 3700 ఎంఏహెచ్ గా ఉంది.ఇది ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. వెనకవైపు కెమెరాలో ఆటోఫోకస్ ఫీచర్ ను కూడా అందించారు.
ఇందులో 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను అందించారు. రెండు నానోసిమ్ లను ఇందులో అమర్చే విధంగా సిమ్ ట్రేను అందించారు. ఏంజెల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీలను ఇది సపోర్ట్ చేస్తుంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను ఇందులో అందించారు. అలాగే ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box