తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమే..సి.ఎం.కెసిఆర్

ఎస్ తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ర్టం
అభివృద్ధి పనులకు డబ్బుల కొరత లేదు
ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి గ్రామాలకు డబ్బులు
లాక్ డౌన్ లో ను రైతులు ఇబ్బందులు పడొద్దని రైతు భందుడబ్బులు ఇచ్చాం

నర్సాపూర్ అడవులు పరిశీలిస్తున్న కెసిఆర్


తెలంగాణ ధనిక రాష్ట్రమని, అభివృద్ధి పనులకు డబ్బుల కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌ అడవుల్లో గురువారం సీఎం  హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదని కాని ప్రస్తుతం  రాష్ట్రం ఆర్థిక స్థితి మెరుగు పడిందని ఆయన తెలిపారు. ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి గ్రామాలకు డబ్బులు అందించామన్నారు.  దేశానికి అన్నం పెట్టే రైతు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవద్దని లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే మీకు పాలనరాదు అన్నారని సీఎం గుర్తు చేసారు. కానీ మనపాలన మనం చేసుకోవడం వలన  దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందని అన్నారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా స్వయంగా ఈ విషయాన్ని  చెప్పిందన్నారు.  'మన పాలన మనం చేయడం వల్లే ఈ ఫలితం వచ్చింది.. రాష్ట్రంలో ఒకప్పుడు విద్యుత్‌ సమస్యలు ఉండేవి..కాని ప్రస్తుతం 24 గంటలు కరెంట్‌ ఉంటున్నది.. మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరైనా నమ్మారా? కని వచ్చినయ్..ఈ ఏడాదిలోనే సంగారెడ్డికి కాళేళ్వరం నీళ్లు వస్తాయి' అని సిఎం అన్నారు. 'ఇట్ల అన్ని సమస్యలు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం' అని అన్నారు.

పచ్చదనం పరిరక్షణ అందరి బాధ్యత ..సిఎం కెసిఆర్

ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.  ప్రతీ ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పచ్చని పండుగను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఇందులో 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు చేపట్టాలన్నారు. గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలు ఇచ్నుచాయని తెలిపారు.రాష్ట్ర మంతటా పచ్చదనం పెరుగుతోందని, రహదారుల వెంట చెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పిందని అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు