ఒకే ఐఎమ్‌ఈఐ నెంబర్‌తో 13 వేల ఫోన్లు - పోలీసులే షాక్

మీరట్‌ : ఇంటర్‌ నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ-  ఐఎమ్‌ఈఐ నెంబర్ ఒక ఫోనుకు ఒకే నెంబర్ ఉంటుంది. కాని మీరట్ లో 13500 ఫేన్లకు ఒకే నెంబర్  కలిగి ఉన్న ఘటన  వెలుగుచూసింది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సెల్‌ఫోన్‌ కొద్దిరోజుల క్రితం పాడైంది. అయన దాన్ని రిపేరు చేయించారు. అయిన‍ప్పటికి అది సరిగా పనిచేయలేదు. దీంతో దాన్ని సైబర్‌ క్రైం విభాగానికి చెందిన ఓ సిబ్బందికి అప్పగించి, సమస్య ఎంటో చూడమన్నారు. ఈ నేపథ్యంలో ఐఎమ్‌ఈఐల విషయం వెలుగులోకి వచ్చి పోలీసులే షాక్ తిన్నారు.

దీంతో సదరు మొబైల్‌ కంపెనీ, సర్వీస్‌ సెంటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మీరట్‌ ఎస్పీ అఖిలేష్‌ ఎన్‌. సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘  దాదాపు 13,500 ఫోన్లు ఒకే ఐఎమ్‌ఈఐ నెంబర్‌పై పనిచేస్తున్నాయి. ఇది భద్రతకు సంబంధించిన సీరియస్‌ సమస్య. మొబైల్‌ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తులు వారి స్వలాభానికి దాన్ని వాడుకునే అవకాశం ఉంది’’ అని అన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు